
అయితే ఇలాంటి నేపథ్యంలో కలవకుంట్ల కవిత లేక రాయడంపై గులాబీ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కెసిఆర్ కుమార్తెగా కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే... ఎంత వేల్యూ ఉంటుందో చూడాలని ఆయన స్పష్టం చేశారు. కవిత పార్టీ పెట్టడం కేవలం ఊహగానాలు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు గంగుల కమలాకర్.
గులాబీ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటలను తాను ఏకీభవిస్తానని స్పష్టం చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసీఆర్ ఆదేశాలకు ప్రకారం నడిచే కార్యకర్తలం మేము అందరం అంటూ.. స్పష్టం చేశారు గంగుల కమలాకర్. ఇక కల్వకుంట్ల కవిత మనసులో ఏముందో తమకు తెలియదని.. కేటీఆర్ అలాగే హరీష్ రావు అటు కేసీఆర్ డైరెక్షన్లో మేము పనిచేస్తామని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా... కల్వకుంట్ల కవిత లేఖ రాసిన నేపథ్యంలో.. ఇవాళ ఎర్రవల్లిలో... కల్వకుంట్ల చంద్రశేఖర రావును కేటీఆర్ కలవడం జరిగింది. కవిత లేక పై ఇద్దరు చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు