మూడు రోజుల నుంచి కడపలో మహానాడు సభను టిడిపి నేతలు కార్యకర్తలు పెట్టి నిన్నటి రోజు విజయవంతంగా ముగింపు పలికారు. అయితే వీటి పైన చాలామంది ఇప్పటికి విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా సీనియర్ ఎన్టీఆర్ రెండవ భార్య నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ అటు సీఎం చంద్రబాబును, కుమారుడు నారా లోకేష్ ని ఏకిపారేయడం జరిగింది. కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కూడా కడప ప్రజలంతా కూడా టిడిపికి ఓట్లు వేస్తారనుకోవడం ఈ తండ్రి కొడుకుల మూర్ఖత్వం అంటూ ఫైర్ అయ్యింది సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి.


చంద్రబాబు, లోకేష్ మహానాడును చాలా బ్రస్టు పట్టిస్తున్నారని ప్రజలకు ఏం మంచి చేసి మహానాడుని జరుపుకుంటున్నారంటూ ప్రశ్నించింది?. కేవలం ఒకరినొకరు పొగుడుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేసుకున్నారని అక్కడికి వచ్చిన వారంతా కూడా విసిగిపోయి వెళ్ళిపోయారని.. తండ్రేమో సూపర్ సిక్స్ అంటే కొడుకేమో పేరు మార్చి 6 సూత్రాలు అంటున్నారు.. ఎన్టీఆర్ ని ఎన్ని తిట్లు తిట్టించారు రాష్ట్ర ప్రజలకు తెలుసు.. చంద్రబాబు ప్రమాణస్వీకారనికి ఎన్టీఆర్ ఇంటి దగ్గరికి వెళితే లోపలికి రానివ్వకుండా తిట్టి పంపించారని...కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ తెలిపింది నందమూరి లక్ష్మీపార్వతి.



ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యారు చంద్రబాబు.. అప్పటినుంచి ఇప్పటికే అందర్నీ మోసం చేస్తున్నారని తెలిపింది. ప్రజలకు ఇచ్చిన హామీలను చేయడంలో విఫలమయ్యారని.. జగన్ చేసిన అభివృద్ధి చూసి లోకేష్ ,చంద్రబాబు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారని తెలిపింది.. ముఖ్యంగా అది మహానాడు కాదు ఒక పీడనాడు అంటూ మాట్లాడింది లక్ష్మీపార్వతి. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ అసలైన వారసుడు లోకేష్ కాదంటూ ఫైర్ అయ్యింది. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ కరెక్టు వారసుడు అంటూ విమర్శించింది నందమూరి లక్ష్మీపార్వతి. అవినీతిలో కోట్ల రూపాయలు సంపాదనను సంపాదించి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వీరిని మించిన తండ్రి కొడుకులు లేరంటూ విమర్శించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: