
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మంగళవారం తో సంవత్సరం పూర్తయింది .. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే .. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తేదీన .. 7000 కోట్ల తాజాగా అప్పు చేయటం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది ? అన్నది ఇప్పుడు పెద్ద అంతు చిక్కిని ప్రశ్నగా మారింది .. తాజాగా చేసిన ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా .. రూ. 1,01,194 కోట్లకు దగ్గరకు వెళ్లాయి .. అలాగే ఆర్బిఐ .. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 6.61 శాతం నుంచి 6.84 శాతం వడ్డి కి ఈ మొత్తం అప్పును తీసుకున్నారు .. బడ్జెట్ లోపలే కాకుండా బడ్జెట్ బయట కూడా అప్పులు చేయటం ఇక్కడ బాగా కనిపిస్తుంది ..
అలాగే వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీలతో .. రూ . 19,410 కోట్ల అప్పు ఈ ఏడాదిలోనే చేశారు .. ఇంకోవైపు రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్ .. జర్మనీకి చెందిన ఓ సంస్థ నుంచి 31 వేల కోట్లు చేశారు ఇవన్నీ కలిపితే ఏడాదిలోనే .. రూ . 1.51 లక్షల కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది .. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే .. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న 31 వేల కోట్లు ఈ లెక్కల్లోకి రాదు .. ఎందుకంటే .. ఈ అప్పు పైసలు చేతికి రాలేదన్న విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు .. ఇలా మొత్తంగా చూస్తే .. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో బడ్జెట్ అప్పు ఏకంగా .. రూ. 1,01,194 కోట్లు వరకు ఉండగా .. ఇదే క్రమంలో బడ్జెట్ ఇతర అప్పు ... రూ .19,410 కోట్లను మాత్రమే రుణాలుగా తీసుకోవాలి .. ఏదేమైనా ఈ ప్రభుత్వ హయాంలో ఆయన అప్పులు తీసుకునే అలవాటును కూటమి ప్రభుత్వం తగ్గించుకుంటే మంచిదన్న అభిప్రాయాలు గట్టిగా వస్తున్నాయి .