ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే సాక్షి ఛానల్ నిర్వహించినటువంటి ఒక డెబిట్ లో భాగంగా మహిళలను కించపరిచారనే విధంగా వార్తలు వినిపించడంతో మహిళలు చాలా చోట్ల నిరసనలు చేపట్టారు. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పొగారు బోర్డు వద్ద రైతులతో మాట్లాడేందుకు నేరుగా పొదిలిలో పర్యటించగా అక్కడ మహిళలు నిరసనకు దిగినట్లుగా తెలుస్తోంది. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్థిస్తున్నారంటూ కొంతమంది నిరసనలు తెలియజేశారు. ముఖ్యంగా జగన్ క్షమాపణలు చెప్పాలి అంటూ పలు రకాల ప్లకార్డులను పట్టుకుని మరి చేపట్టారు. అక్కడ రైతులకు సంబంధించి కష్టనష్టాలను అడిగి ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు జగన్.



జగన్ పొదలి పర్యటనలో ప్రస్తుతం పలు రకాల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కాన్వాయ్  వెళుతూ ఉండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో దగ్గరలో ఉండే కానిస్టేబుల్స్ కు,మహిళలకు గాయాలయ్యాయట. ఆ సమయంలోనే  మహిళలతో కలిసి  అక్కడ టిడిపి నేతలు నిరసనలు చేస్తూ ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా పొదలి ప్రాంతంలో టిడిపి, వైసిపి శ్రేణులు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి చేయి జారిపోయినట్టుగా కనిపిస్తోంది.



ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వీటిని అదుపు చేసేందుకు పోలీసులు సైతం లాటి చార్జిని కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అటు కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు పైన కక్ష సాధింపులు చేస్తున్నారని.. అలాగే సరికొత్త వాటికి కూటమి ప్రభుత్వం నాంది పలుకుతోందని రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని  వైసీపీ నేతలతో పాటు మాజీ సీఎం జగన్ కూడా హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: