
బదిలీపై వఛ్చి జాయినింగ్ రిపోర్ట్ చూపించిన ఉద్యోగులకు పిఠాపురం నియోజకవర్గంలో చుక్కెదురైందని తెలుస్తోంది. ఎవరు పడితే వాళ్ళు జాయిన్ కావడానికి ఇది మామూలు నియోజకవర్గం అనుకున్నావా? పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంటూ జాయిన్ అవ్వాలంటే ప్రత్యేక ఆర్డర్ ఉండాలంటూ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు చెప్పిన్నట్టు చిరుద్యోగులు ప్రముఖ దినపత్రిక సాక్షితో వెల్లడించారు.
మున్సిపల్ ఆర్డీ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని చిరుద్యోగులు చెప్పగా ఎవరు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకే చెప్పుకోండంటూ మీకు దిక్కున్న వాళ్లకు చెప్పుకోండంటూ కమిషనర్ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాము పని చేస్తున్న చోట రిలీవ్ అయ్యామని ఇప్పుడు జాయిన్ చేసుకోకపోతే తమ పరిస్థితి ఏంటని చిరుద్యోగులు వాపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాము దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చిరుద్యోగులు చెబుతున్నారు.
తుని పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీల నుంచి ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు పిఠాపురం మున్సిపాలిటీలకు బదిలీ ఆర్దర్లతో రాగా జాయినింగ్ రిపోర్టులను తీసుకోవడానికి కమిషనర్ నిరాకరించారని తెలుస్తోంది. ఈ ఘటనపై జనసేన ఇంచార్జ్ అనుమతులు తీసుకోవాల్సి ఉందని అనుమతులు తీసుకోకుండా తామేం చేయలేమని ఆయన చెప్పినట్టు భోగట్టా. జనసేన ఇంచార్జ్ అందుబాటులో లేకపోవడం వల్లే జాయినింగ్ లెటర్స్ తీసుకోలేదని ఆయన చెప్పినట్టు సమాచారం అందుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు