
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎప్పుడు ? ఏం జరుగుతుందో ? ఎవరు ఏం మాట్లాడతారో ? ఎవరు ఎప్పుడు అలక బూనతారో ? కూడా తెలియడం లేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాస్త కోప పడినట్టు తెలంగాణ కాంగ్రెస్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టినట్టు టాక్ ? ఇక క్యాబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన వేరొకరు మాట్లాడ్డం ఏంటని మహేష్ కుమార్ కాస్త గట్టి స్వరంతోనే మాట్లాడినట్టు సమాచారం.
కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి జాగ్రత్తగా ఉండాలి కదా ? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఏదో ఒకటి మాట్లాడేస్తే ఎలా ? అని కూడా పీసీసీ అధినాయకత్వం పొంగులేటికి సూచనలు చేసినట్టు సమాచారం. పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని పీసీసీ చీఫ్ సూచించారట. ఇక మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పీసీసీ సూచనలు చేసిందని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు