
కమిషనర్ కర్ణన్ మూడు నెలలో వీటిని ప్రారంభిస్తానని చెప్పడం గమనార్హం హైదరాబాద్ నగరంలో 2013 సంవత్సరంలో 5 రూపాయల భోజన కార్యక్రమం మొదలైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి 138 కేంద్రాలు పని చేస్తుండటం గమనార్హం. ఈ కేంద్రాల ద్వారా రోజుకు 30 వేల మంది భోజనం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నిర్వహణను హరేకృష్ణ సంస్థ చూసుకుంటోంది.
ఈ సంస్థ ప్రజల నుంచి ప్లేట్ భోజనానికి 5 రూపాయలు వసూలు చేస్తుండగా జీ.హెచ్.ఎం.సి సంస్థ తరపున హరే కృష్ణ సంస్థకు 14 రూపాయలు వెళ్లనున్నాయని తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్ లో తయారయ్యే పలు రకాల పదార్థాలను తృణ ధాన్యాలతో తయారు చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
ప్రస్తుతం ఏపీలో అన్న క్యాంటీన్లు అమలవుతున్న సంగతి తెలిసిందే. అన్న క్యాంటీన్ల ద్వారా కూడా తక్కువ మొత్తానికే భోజనం, బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్కువ మొత్తానికే బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు