
అయితే వచ్చే మూడేళ్లలో ఇతర దేశం పౌరులకు 4,97,550 వర్క్ పర్మిట్లు జారీ చేశారా ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందట. స్థానికంగా లేబర్ మార్కెట్ సమస్యలను సైతం పరిష్కరించడానికి వీటిని హైలైట్ చేస్తున్నారట.
2026:164,850 వర్క్ పర్మిట్లు
2027:166,350 వర్క్ పర్మిట్లు
2028:166,350 వర్క్ పర్మిట్లు
దేశవ్యాప్తంగా ఇటలీలో క్లిష్టమైన సిబ్బంది కొరత ఉన్నదని వీటిని ఎదుర్కొనేందుకు వివిధ రంగాలకు కూడా ఈ వీసాలను పంపిణీ చేయబోతున్నారట. అయితే ఇందుకు సంబంధించి కొన్ని పరిశ్రమల కింద ఇస్తున్నట్లు తెలియజేశారు.
ముందుగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగం, నిర్మాణరంగం, టూరిజం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ తో పాటుగా సైబర్ సెక్యూరిటీ వంటి డిజిటల్ సేవలు రంగానికి సంబంధించిన వాటికి వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థను మరింత ఊపు అందుకునేలా చేయబోతున్నారట.
ముఖ్యంగా లేబర్ కొరత ఇటలీలో చాలా ఎక్కువగా ఉందని. అక్కడ ఖాళీలను భర్తీ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారట. కనీసం 70 శాతం మంది కార్మికులను నియమించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదట ఇటలీ.
ఇటలీ హోటల్లు, రెస్టారెంట్ వంటి సర్వీసులలో..2,58,000 ఖాళీగా ఉన్నాయట.
అలాగే లక్షకు పైగా .. వైద్యరంగంలో నర్సులు వైద్యులు పోస్టు ఖాళీగా ఉన్నాయి.
ఇంజనీరింగ్, గ్రీన్ ఎకానమీలో 2,80,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు చాలా అవసరం ఉన్నదట.
2024లో ఇటలీలో 37,000 మంది జనాభా తగ్గిందట.
అలాగే ఉద్యోగానికి కావాలో అప్లై చేసిన తర్వాత.. ఇటలీలో మీరు సంపాదించేంతవరకు మిమ్మల్ని పోషించుకోవడానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా సమర్పించాలి.