
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఈ పెట్టుబడులు కీలకమని ఆయన పేర్కొన్నారు.పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు నాశనమైందని ఆరోపించారు. జగన్ నాయకత్వంలో అవినీతి, కుంభకోణాలు బయటపడుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ నేత అమర్‌నాథ్ అవాస్తవ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం పారదర్శక హామీలతో అభివృద్ధి పనులు చేపడుతోందని, దీనిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని ఆయన అన్నారు.విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని పల్లా తెలిపారు.
ఈ సంస్థలు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. అయితే, వైసీపీ ఈ అవకాశాలను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తోందని, తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళపరుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ చర్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన హెచ్చరించారు.వైసీపీ పాలనలో పెట్టుబడులు ఆకర్షించడంలో విఫలమైందని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా తప్పుబట్టడం దుర్మార్గమని పల్లా విమర్శించారు. రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల రంగంలో కొత్త ఊపిరి లభిస్తుండగా, వైసీపీ ఈ ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తోందని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఆర్థిక వృద్ధికి కృషి చేస్తోందని, ఈ దిశగా అడ్డంకులను అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు