తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిరమైన గుర్తింపు పొందిన సహజ నటి జయసుధ రాజకీయ రంగప్రవేశం చేసి ఎంత హాట్ టాపిక్ అయ్యారో... ఇప్పుడు ఆమె కుమారుడు నిహార్ కపూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. 2015లో ‘బస్తీ’ సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నిహార్... తర్వాత అవకాశాలు రాక వెనక్కి తగ్గాడు. తాజాగా 'హరిహర వీరమల్లు'లో ముఖ్య పాత్ర పోషించి మరోసారి మీడియాలో హైలైట్ అవుతున్న నిహార్... ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు రాజకీయం వైపు దృష్టి మళ్లించాయి. కండువా వెసేసే కారణం ఏంటో నాకే తెలియదు! ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిహార్ కపూర్, “అమ్మతో పాటు జగన్‌ను కలవడానికి వెళ్లాను. ఆఫీస్‌లో ఉన్నవాళ్లు నాకూ కండువా వేసేశారు. ఎందుకెందో తెలీదు. ఎవరు వెళ్లినా వాళ్లు వేసే పద్ధతే అయి ఉంటుంది అనుకుంటా,” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కానీ ఇదే కామెంట్ ఇప్పుడు రాజకీయ వేడి రేపుతోంది.


వైరల్ కామెంట్లపై టిడిపి ట్రోలింగ్ ఫైర్ ..  నిహార్ చేసిన కామెంట్‌పై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు జోరుగా ట్రోలింగ్ చేస్తున్నారు. “తాడేపల్లి వెళ్లితే కండువా ఉచితం అంటూ” పంచ్ డైలాగులు, మీమ్స్ వరుసగా పడుతున్నాయి. నిహార్ కామెంట్స్‌లో వైసీపీపై వ్యంగ్య శైలిలో ఉందా? లేక తన అమాయకత్వమా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జయసుధపార్టీ మార్పుల పరంపర ..  జయసుధ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తో మొదలై, టీడీపీ, వైసీపీ గుండా చివరికి బీజేపీ వరకు చేరింది. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, ఆపై రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. మళ్లీ 2019కి ముందు జగన్‌ను కలవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో నిహార్ కూడా ఆమెతో కలిసివెళ్లాడు. వైసీపీ కండువాతో తల్లి-కుమారుడు కనిపించిన ఫోటోలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి.


ఇప్పుడు బీజేపీలో జయసుధ – నిహార్ ఎటు? .. 2023లో జయసుధ బీజేపీలో చేరినా ఆమె కుమారుడు నిహార్ మాత్రం ఇప్పటికీ ఏ పార్టీకి చెందినవాడో స్పష్టత లేదు. కానీ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఆయన రాజకీయ రంగంలోనూ తన పేరును వినిపించాడు. నటుడిగా కాదు, రాజకీయాల్లోనైనా తనకో చోటు దొరికేనా? అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మొత్తానికి... నటుడు కాకపోయినా, రాజకీయాల్లో మాత్రం ఎంట్రీ కొడతాడా నిహార్ కపూర్? తల్లి జయసుధ అడుగుజాడల్లో నడుస్తాడా? అనే ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్న కామెంట్ల కంటే పెద్ద డిబేట్‌గా మారాయి. వైసీపీ కండువా వేసినా... రాజకీయంగా నిహార్ ఎటు అన్నది చూడాల్సిన విషయం.





మరింత సమాచారం తెలుసుకోండి: