తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలకు గురవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన ఎన్నో అవినీతి అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తోంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న బీఆర్ఎస్ పార్టీ అమ్మాయిల్ని, హీరోయిన్లను వాడుకున్నారు అనే విషయంలో కూడా ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్హీరోయిన్ ని వాడుకున్నారని,ఆ హీరోయిన్ నెల రోజులకే మా దగ్గరికి వచ్చి తన పరిస్థితి అంతా చెప్పుకొని వాపోయింది అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతో మంది కీలక నాయకులు చెబుతున్నారు.అంతేకాదు హోటల్ పేరుతో సహా బయట పెడుతున్నారు. వీలైతే వీడియోలు కూడా బయట పెడతాం అంటూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయాల్లో దుమారం సృష్టించాయి. 

శ్రీరెడ్డి కేటీఆర్ తో డిన్నర్ డేటింగ్ అంటూ మాట్లాడిన మాటలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి. ఇక విషయంలోకి వెళ్తే..బోల్డ్ బ్యూటీ అయినటువంటి శ్రీరెడ్డి అవకాశాల కోసం ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు మూడు సినిమాలు చేసింది.ఆ తర్వాత అవకాశాలు ఇస్తామని చెప్పి దగ్గుబాటి అభిరామ్ నన్ను వాడుకున్నాడని,ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్నంగా కూర్చున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే ఇండస్ట్రీలో ఉన్న పలువురు సెలబ్రిటీలను బహిరంగంగానే తిడుతూ ఉంటుంది.అయితే అలాంటి శ్రీ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో సామజిక మధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే..నాకు కేటీఆర్ మీద ఒక రకమైన క్రష్, అడ్మైరేషన్ ఉంది. ఆయన అంటే ఇష్టం.ఒక్కసారైనా ఆయనతో డిన్నర్ డేటింగ్ కి వెళ్ళాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే శ్రీరెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పటిదైతే కాదు. 

పాతదే అయినప్పటికీ దీన్ని కాంగ్రెస్ వాళ్లు తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో శ్రీరెడ్డి చెప్పిన విషయాన్ని కొంతమంది గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వారిదని,ఇక మరికొంతమంది అయితే కేటీఆర్,శ్రీరెడ్డిని కలుపుతూ ఏకీపారేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ రెడ్డికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియా లో చాలా వైరల్ గా మారుతుంది. ఇక గతంలో శ్రీరెడ్డి o ఇంటర్వ్యూలో పార్క్ హయత్ హోటల్ కి ఒక ఎమ్మెల్యే నన్ను  పిలిచాడని,అయితే ఆ సమయంలో నా మూడ్ బాలేదని, అంతేకాకుండా ఆ ఎమ్మెల్యే నాతో చాలా హార్ష్ గా బిహేవ్ చేశాడని,దాంతో మూడ్ బాలేకపోవడంతో తిరిగి వచ్చేసానని,ఎంత బోల్డ్ గా ఉన్నా సరే మూడ్ బాలేకపోతే ఏమీ చేయలేము కదా అంటూ 
బహిరంగంగానే చెప్పింది.అయితే ఆ ఎమ్మెల్యే పేరు మాత్రం మెన్షన్ చేయలేదు. అలా తన ముక్కు సూటి తనంతో శ్రీరెడ్డి ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: