టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు. సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపును డిమాండ్ చేస్తుండగా ఈ డిమాండ్ గురించి నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. సినిమా కార్మికులు 30 శాతం వేతన పెంపును కోరుతున్నారని మరి థియేటర్లకు ప్రేక్షకులను ఎవరు రప్పిస్తారని ఆయన ప్రశ్నించారు. మా సినిమా బడ్జెట్లకు సంబంధించిన బాధ్యతను ఎవరు తీసుకుంటారంటూ ఆయన కామెంట్లు చేశారు.

అలా చేస్తే 30 శాతం కాదు 40 శాతం 50 శాతం సైతం పెంచడానికి సిద్ధమేనని చెప్పుకొచ్చారు. నిర్మాతలకు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉంటాయని  2022 సంవత్సరంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పందం ప్రకారం 25 శాతం తగ్గించి ఇవ్వమని చిన్న నిర్మాతలకు ఫెడరేషన్ చెప్పిందని కానీ ఆ నియమాన్ని యూనియన్లు పాటించడం లేదని నిర్మాత అన్నారు.  ప్రస్తుతం సినిమా వ్యాపారం బాలేదని ఆయన తెలిపారు.

ఒక ప్రాతిపదికన కాకుండా అందరికీ వేతనం పెంచి ఇవ్వాలంటే కష్టమని మేము పాన్ ఇండియా సినిమాలు నిర్మించడం లేదని టికెట్ ధరల పెంపులాంటివి చిన్న నిర్మాతలకు వర్తించవని మా కష్టాలు వేరని ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు. నిర్మాత ఎస్కేఎన్  కామెంట్ల విషయంలో ఫెడరేషన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ వివాదం కొత్త మలుపులు తిరుగుతోందని తెలుస్తోంది.

సోమవారం నుంచి సినిమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో బంద్  మొదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డికి ఫెడరేషన్ నాయకులూ కలవగా కోమటిరెడ్డి సైతం ఫెడరేషన్ నేతలకు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అందుతోంది.  మరోవైపు 14 మంది నిర్మాతలు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కలవడం సంచలనం అవుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

skn