కొంత మంది తమ అభిమాన హీరో ముఖాన్ని లే దా తమ అభిమాన రాజకీయ నాయకుడి బొమ్మను లేదా తమ అభిమానించే వ్యక్తులకు సంబంధించిన పచ్చబొట్టులను ఒంటిపై వేసుకుంటూ ఉంటారు. అలా తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇకపోతే ఓ వ్యక్తి తన అభిమాన రాజకీయవేత్త పచ్చబొట్టును తన గుండెపై వేయించుకున్నాడు. ఇక ఆ పచ్చ బొట్టే ఆయన ప్రాణాలను కాపాడింది. ఇంతకి ఏం జరిగింది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

వనపర్తి లోని పేర్ల గుట్టలో సోమవారం ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. 49 సంవత్సరాలు కలిగిన తైలం రమేష్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. ఇక రమేష్ కు మాజీ మంత్రి అయినటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. ఆయన పై ఉన్న అభిమానంతో ఆయన పచ్చ బొట్టును చాతిపై వేయించుకున్నాడు. గత కొంత కాలంగా రమేష్ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ఇక తాజాగా ఆయన పీర్లగుట్టలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఆయన ఆదివారం రోజు అల్పాహారం తీసుకున్నాక అస్వస్థకు గురయ్యాడు. అస్వస్థత కు  గురయ్యాక ఆయనలో చలనం లేకపోవడంతో ఆయన చనిపోయారు అనే నిర్ధారణకు వచ్చారు.


దానితో కుటుంబ సభ్యులను పిలిచి అంత్య క్రియలకు కూడా ఏర్పాటు చేశారు. ఇక తన అభిమాని మరణించాడు అనే విషయం తెలియడంతో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా చివరి చూపు కోసం వచ్చాడు. ఇక ఆ క్రమంలో రమేష్ చాతిపై ఉన్న పచ్చబొట్టును చూస్తున్న సమయంలో ఆయన ఊపిరి పిలుస్తున్నట్లు అనుమానం రావడంతో ఆయన మెడలో ఉన్న పూల మాలలు అన్నీ తీయించాడు. ఇక ఆ తర్వాత ఆయనను పిలవగా ఆయన కనురెప్పలు కదిలించడంతో అతన్ని ఆసుపత్రికి  తరలించగా ఆయన ఆరోగ్యం కూడా ప్రస్తుతం మెరుగుపడినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: