
అమరావతి భవిష్యత్తు అంతా కూడా సీఎం చంద్రబాబు చేతిలోనే ఉందని..ఇంకా మూడేళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈలోపే అమరావతిని అభివృద్ధి చేసి ఎక్కడ కదలకుండా చూసుకోవాలంటు మాట్లాడారు. తర్వాత వచ్చే ప్రభుత్వాలకు ఇతర ఆలోచనలు రాకుండా ఉండేలా చేయాలని.. అదంతా చంద్రబాబు చేతుల్లోనే ఉందని , వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తారని.. అలాగే రాజధాని ప్రాంతంలో రైతులకు ఫ్లాట్లను అభివృద్ధి చేస్తామంటూ మాట్లాడారు.. విజయవాడ ,గుంటూరు మధ్య ఒక పెద్ద మహా నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ తెలిపారు. అయితే రాజధాని నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయకూడదని అదే మా నాయకుడి అభిమాతమంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఈ విషయాల పైన కూటమి అనుకూల మీడియా వైయస్ జగన్ రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నారంటు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలకు వైసీపీ సొంత మీడియా కూడా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఈ అభిప్రాయం వైసిపి పార్టీ అధినేత జగన్ దా ?లేకపోతే సజ్జల రామకృష్ణ వ్యక్తిగతమా? అన్నటువంటి అనుమానాలు మొదలవుతున్నాయి.
అమరావతి పైన సజ్జల మాటల్ని జగన్ పరిశీలించారట.. ఆయన మాటలు విన్న తర్వాత వైయస్ జగన్ సజ్జల మీద ఫైర్ అయినట్లు తెలిసింది. ఇప్పుడిప్పుడే వైసిపి పార్టీ పుంజుకుంటోంది. ఇలాంటి సమయంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు అవసరమా అనే ఆలోచనలో వైయస్ జగన్ ఉన్నారు. రాజధాని అనే అంశం చాలా కీలకమైన అంశము వాటిపైన ఏదైనా ఉంటే తానే మాట్లాడతానని మీకేం పని అంటూ సజ్జల పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయినట్లు తెలిసింది.
ఇలా మాట్లాడితే ఇక తానేందుకు?అంటు జగన్ సజ్జలను నిలదీసినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.మాట్లాడిన అంశాలలో మంచి చెడులు సమస్య కాదని..తనకు చెప్పకుండా సొంత అభిప్రాయాలను కూడా వైసిపి ఖాతాలో వేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు వినిపిస్తున్నాయి. కేవలం వైసిపి అంటే సజ్జలనే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారనే విధంగా ఫిర్యాదులు కూడా జగన్ వద్దకు చాలానే వెళ్లినట్లుగా తెలిసింది. ఇప్పుడు ఆ ఫిర్యాదులకు మరింత బలం చేకూరేలా సజ్జన రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తే జగన్ కు అర్థమవుతోంది.
వైసీపీ హయాంలో అమరావతి నిర్ణయం ఎంతటి వివాదాస్పదంగా మారిందో తెలిసింది.. మూడు రాజధానులంటూ ప్రతిపాదన తీసుకువచ్చిన ప్రజలకు నచ్చలేదు.. ఇప్పుడు కూడా రాజధాని పైన భారీగా ఖర్చు చేయకూడదనేది జగన్ అభిప్రాయం.. ఇటీవల మీడియా సమావేశంలో కూడా గుంటూరు ,విజయవాడ మధ్య ఏదైనా అభివృద్ధి జరిగితే చాలు దానికదే రాజధానిగా అభివృద్ధి చెందుతుందంటూ మాట్లాడారు. ఇంకా ఏదైనా రాజధాని విషయంలో చెప్పాలి అనుకుంటే సమయం సందర్భం చూసుకునే మాట్లాడుతాను అంటూ వెల్లడించారు. కానీ సజ్జల మాత్రం జగన్ కంటే తాన ఎక్కువ అన్నట్లుగా అమరావతి పైన మాట్లాడారు. అలాగే వైసిపిలో గత కొంతకాలంగా సీనియర్ నాయకులు సజ్జల తిరు పైన జగన్ కి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఆయన తన తీరులో మార్పు లేదు..ఇవన్నీ కూడా చివరికి వైసిపి పార్టీ కి, జగన్ కి నష్టం తీసుకువస్తాయనే అభిప్రాయం పార్టీలో ఉంది.