ఈరోజు భారత ప్రధాన నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు కావడం చేత కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున దేశమంతా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత రాజకీయ నేతగా ఎదిగిన మోదీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. అందుకే దేశంలో ప్రజలతో పాటు ఎంతోమంది యువత కూడా మోదీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు. మోదీ అందుకుంటున్న జీవితం , ఆయన ఆస్తుల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.


భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ ప్రతినెల రూ.1.66 లక్షల రూపాయలు జీతాన్ని అందుకుంటున్నారు. ఇక రోజువారి అలవెన్స్ ఇతరత్రా అలవెన్స్ వల్ల రూ.45,000 రూపాయలు.. పార్లమెంట్ అలవెన్స్ రూ .3000 రూపాయలు, ఇతర అలవెన్స్ ద్వారా వచ్చే జీతాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ తమ సహాయ నిధికి విరాళంగా ఇచ్చేస్తారు. మోదీ ఆస్తి గత 18 సంవత్సరాలుగా పరిమితంగానే పెరిగింది.. ప్రధానమంత్రి మోదీ ఆస్తి 2007లో రూ.42.56 లక్షలు ఉండగా.. 2012లో అది రూ.1.33 కోట్లు.. 2014లో రూ.1.26 కోట్లు.. 2017లో రూ .2 కోట్ల రూపాయలకు చేరింది. 2024 లో మోడీ ఆస్తి రూ.3.2 కోట్ల రూపాయలకు పెరిగింది.


మోదీ వద్ద మొత్తం ఉన్న నగదు రూ.52,920  రూపాయలు.. భూమి, ఇల్లు వంటి ఆస్తి అసలు లేదు ఆయన పైన ఎటువంటి బ్యాంకు రుణం కూడా లేదు. వీటితో పాటుSBI లో ఫిక్స్డ్ డిపాజిట్లు దానిపైన వడ్డీతో కలిపి రూ.2.85 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నది.. ఎస్బిఐలో మోదీ అదనపు డిపాజిట్ కింద రూ.80,304 రూపాయలు ఉన్నది.. మోడీ వద్ద ఉన్న బంగారం విలువ విషయానికి వస్తే రూ.3 లక్షల రూపాయలు ఉన్నది.  దేశ ప్రధాని అయిన కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: