
అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తర్లపాడు మండలానికి సంబంధించి కలుజువ్వలపాడు గ్రామంలో ఒక మహిళ చేతులను రెండు కర్రలకు కట్టేసి.. బెల్టుతో మహిళల గొడ్డును బాదినట్టుగా బాదుతున్న సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ మహిళ పెట్టే ఆర్తనాదాలు అందరి గుండెను కదిలించేలా కనిపిస్తోంది. మొదట ఆ వీడియోని క్రియేట్ చేసారనుకున్నప్పటికీ కానీ ఆ వీడియోలో జరిగిన సంఘటన నిజంగానే జరిగిందని తెలుస్తోంది.
గురునాథం అనే వ్యక్తి తన భార్యను ఇలా చిత్రహింసలు చేసి మరి కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురునాథం ఇలా కొట్టడానికి ముఖ్య కారణం తన భార్య ఉండగానే మరొక మహిళతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించి ఆమెతో హైదరాబాద్ కి వెళ్లిపోయారు.. భర్త వదిలేయడంతో గురునాథం భార్య తన పిల్లలని పోషించుకోవడానికి అదే గ్రామంలో బేకరీలో పని చేస్తోంది. అప్పుడప్పుడు గురునాథం స్వగ్రామానికి వస్తు తన భార్య దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని చిత్రహింసలు పెట్టేవారు.. అలా ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి తన భార్యను డబ్బుల కోసం వేధించారు.ఆమె లేదని చెప్పడంతో ఇలా కర్రకు కట్టేసి మరి క్రూరంగా కొట్టాడు. ఈమె ఆ దెబ్బల బాధలను తట్టుకోలేక తీవ్రంగా విలపించినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చలించిపోతున్నారు. ఈ వీడియో పోలీసులు దాకా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. గురునాథం మొదటి నుంచి కూడా తన భార్యను ఇలా హింసలు పెట్టే వారిని ఆ గ్రామస్తులు తెలియజేస్తున్నారు.. అతనిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు.