మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే వీరి హయాంలో దేశం టెక్నాలజీలో ఎంతో దూసుకుపోయిందని చెప్పవచ్చు. అంతేకాదు మోడీ మానియాలో  దేశ అభివృద్ధి కూడా అంతే అద్భుతంగా జరుగుతోంది. అలాంటి ఈ తరుణంలో  జీఎస్టీకి సంబంధించి దేశంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు.ఈ జీఎస్టీ పెంచడం వల్ల ప్రతి వస్తువుపై రేటు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడింది. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న ఎర్రకోటపై జీఎస్టీ పై ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.. మరి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి, ఏ రాష్ట్రాలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాయి అనే వివరాలు చూద్దాం.. ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ ఎప్పుడైతే జిఎస్టి గురించి మాట్లాడారో అప్పుడే దేశమంతా ఆశ్చర్యపోయింది. 

అయితే ఈ సందర్భంగా ఆయన జీఎస్టీ పెంచుతారని అందరూ భావించారు. కానీ సడన్ గా జీఎస్టి తగ్గిస్తున్నామని చెప్పడంతో  షాక్ అయిపోయారు. ఇదే కాకుండా టోల్ గేట్ల నుంచి కూడా విముక్తి ఉంటుందని చెప్పేశారు. ఈ విధంగా వస్తువులపై 100 రూపాయలు ఉన్న దగ్గర ₹10 తగ్గిపోతే, వేయి రూపాయల కొనుగోలు చేస్తే 100 రూపాయల  తగ్గింపు ఉంటుంది. దీనివల్ల మనం తీసుకునే వస్తువులపై చాలావరకు ధర తగ్గి మనకు మేలు కలుగుతుంది.  అలాంటి జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని  దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్  మొదటిసారి యాక్సెప్ట్ చేసింది. మొదటిసారి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ వారికి ప్రోత్సాహం అందించింది.

జీఎస్టి నిర్ణయంపై ఏకంగా ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు మేలు చేశారు అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. జీఎస్టీ 2.0తో ప్రతి పౌరుడికి లబ్ధి జరుగుతుందని అన్నారు. కేంద్రం తీసుకున్న జీఎస్టీ నిర్ణయానికి తొలిసారిగా మద్దతు తెలిపింది ఏపీ రాష్ట్రమే అంటూ తెలియజేశారు. అలాగే రాష్ట్ర ఆదాయానికి నష్టమైన కానీ ప్రజల ప్రయోజనం కోసం మద్దతు తెలిపామని అన్నారు. ప్రధాని మోడిని అభినందిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టడంతో అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విధంగా ఏపీ నుంచి మోడీకి మొదటిసారి చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: