
చివరికి రీసెంట్‌గా ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ సంతోషకరమైన వార్త తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ హ్యాపీ మూమెంట్‌ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. "మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చేశాడు" అంటూ మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కొడుకు పేరుకి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా, బాబు పేరు కి మెగా సెంటిమెంట్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తల ప్రకారం, వారిద్దరి బిడ్డకు "ధృవ్ ధీర్ తేజ్" అనే పేరు పెట్టారని తెలుస్తోంది.ఇది వినగానే మెగా ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఉన్న "తేజ్" అనే సెంటిమెంట్‌ను మళ్లీ రిపీట్ చేసినట్టే అయింది. పేరు పెట్టేటప్పుడు కూడా, బాబు పుట్టిన రోజు, జన్మక్షేత్రం ప్రకారం వచ్చిన అక్షరాలతో పాటు "తేజ్" అనే పదాన్ని కలిపి ఈ నామకరణం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్‌గా మారింది. "మెగా సెంటిమెంట్ రిపీట్ చేశారే, చాలా మంచి పేరు పెట్టారు" అంటూ అభిమానులు, సినీ ప్రేమికులు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక మెగా ఫ్యామిలీకి కొత్త వారసుడు వచ్చినందుకు, చిన్నారికి "ధృవ్ ధీర్ తేజ్" అనే పేరు పెట్టినందుకు సినీ ఇండస్ట్రీ మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అభిమానులంతా కూడా ఇప్పుడు ఈ క్యూట్ బేబీని చూడటానికి ఎదురుచూస్తున్నారు.