
ప్రస్తుతం అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు. అయితే ఈ మధ్యనే ఆయన నానమ్మగారు కన్నుమూయడంతో దాదాపు 16 రోజులపాటు సినిమా షూటింగ్‌కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలోనే ఈ సినిమాపై మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఈ కొత్త సమస్య పేరు హీరోయిన్ దీపికా పదుకొనే. ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా – దీపికా పదుకొనే మధ్య స్పిరిట్ సినిమా కారణంగా ఓ పెద్ద ఇష్యూ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, దీపికాను ఆ సినిమా నుంచి తీసేయడంతో కోపంగా ఆమె తన పిఆర్ టీమ్ ద్వారా స్పిరిట్ సినిమా కథనే బయటకు లీక్ అయ్యేలా చేసిందని ప్రచారం జరిగింది. ఈ ఘటనపై సందీప్ రెడ్డి వంగా ఘాటుగా స్పందించడంతో వివాదం మరింత పెరిగింది.
అంతేకాదు, కల్కి 2 నుంచి దీపికాను తప్పించడం కూడా ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేసింది. దీంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దీపికాను ఒక విధంగా శత్రువులా చూస్తున్నారు. ఆమె నటించే సినిమాలు బహిష్కరించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే ఉన్నారు. ఇండస్ట్రీలో దీపికా సినిమాలను బహిష్కరిస్తే, ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద సమస్య వస్తుందనే భయాలు మొదలయ్యాయి. దీంతో అట్లీ ఇప్పటికే మూవీ మేకర్స్‌కి దీపికాను సినిమా నుంచి తప్పించాలన్న రిక్వెస్ట్ చేశాడని సమాచారం. కానీ ఇక్కడ మరో సమస్య ఉంది – ఆమె ఇప్పటికే షూట్ చేసిన సీన్స్, వాటిపై ఖర్చైన బడ్జెట్. వాటిని ఎలా సర్దుబాటు చేయాలి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారని ఇండస్ట్రీ టాక్. మొదటినుంచీ అల్లు అర్జున్‌కు దీపికా పదుకొనేతో సినిమాలు చేయడం అంత ఇష్టం లేదట. కానీ అట్లీ పట్టుబట్టి ఆమెను సినిమాలోకి తీసుకువచ్చాడని అంటున్నారు. ఇప్పుడు ఈ వివాదం కారణంగా అల్లు అర్జున్ కూడా భయపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
దీపికా వివాదం వల్ల చివరికి నష్టపోయేది అల్లు అర్జున్ అవుతాడా..? అన్న ఆందోళనలో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తూ – “ఒకరు చేసిన తప్పుకు, శిక్ష మరొకరికి పడుతుంటే, చివరికి బలైపోవాల్సి వస్తున్నది అల్లు అర్జున్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద, దీపికా పదుకొనే – సందీప్ రెడ్డి వంగా మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు అట్లీ సినిమా, అలాగే అల్లు అర్జున్ కెరీర్‌కి పెద్ద కష్టంగా మారింది.