
ముఖ్యంగా మహిళలు చౌకగా ఉన్నప్పుడు వీటిని కొనలేకపోయామనే బాధ, పెట్టుబడులు పెట్టేవారు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయామని బాధపడుతున్నారు. గత ఏడాది ఇదే కాలంలో స్టాక్ మార్కెట్ అత్యవసర లాభాలతో సరిపెడితే బంగారం, వెండి మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా బంపర్ లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా చూస్తే బంగారం, వెండి పైన 50 శాతం పైగా లాభాలను తీసుకోవచ్చాయి. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయ? అనే విషయంపై మాత్రం ఎవరు కచ్చితంగా చెప్పలేమంటూ తెలియజేస్తున్నారు నిపుణులు.
అయితే ఇప్పటికీ గరిష్ట స్థాయికి చేరిన బులియన్ మార్కెట్ త్వరలోనే దిద్దుబాటు చర్యలు ఉంటాయంటూ మార్కెట్ వర్గాల అంచనా తెలియజేస్తున్నారు. ప్రాథమిక పరిస్థితిలలో ఎలాంటి మార్పు లేకపోయినా లాభాల స్వీకరణ , అమ్మకాలలో దోహదం చేస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ దిద్దుబాటు కూడా 5 నుంచి7 శాతం వరకు మించకపోవచ్చు అని అంచనా తెలియజేస్తున్నారు. ట్రంప్ బెదిరింపులు ఫలించి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడిన దిద్దుబాటులలో 10 నుంచి 15% వరకు మించకపోవచ్చు అంటూ తెలుపుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో 10 నుంచి 15% వరకు తగ్గే అవకాశం ఉందంటూ తెలుపుతున్నారు. అందుకే బంగారం, వెండి ఎగబడి ఎవరు కొనొద్దు అంటూ నిపుణులు తెలుపుతున్నారు..