బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల రాజకీయ కూటమి పార్టీలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా హేమంత్ సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్ ముక్తి మొర్చా (JMM) పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లుగా తెలియజేసింది. ముఖ్యంగా ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలో భాగమైన జేఎంఎం పార్టీ పోటీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు బీహార్ ఎన్నికలలో సంచలనంగా మారింది. కాంగ్రెస్, ఆర్జెడి తమకు సీట్లు దక్కకుండా చేస్తున్నారని, ఇది రాజకీయ కుట్ర అంటూ ఆ పార్టీ నాయకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేశారు.


ఈ మేరకు JMM పార్టీ సీనియర్ నేత సుదివ్య కుమార్ కూడా మీడియాతో మాట్లాడుతూ. కాంగ్రెస్, ఆర్జెడి కూటమిలో భాగంగా జేఎంఎం పార్టీ కి అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీనివల్ల జార్ఖండ్లో కాంగ్రెస్ , ఆర్జెడి పార్టీ పొత్తు విషయంపై పునరాలోచిస్తామంటూ తెలియజేశారు. ప్రస్తుతం బీహార్ ఎన్నికలలో ప్రతిపక్ష కూటమి మహాఘట్ బంధన్ పేరుతో పోటీ చేయబోతున్నారు. ఇందులో జేఎంఎం పార్టీ కూడా భాగస్వామిగా ఉన్నది. కానీ సీట్ల పంపకాల విషయంలో మాత్రం కూటమిలో విభేదాలు తలెత్తినట్లుగా వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా JMM పార్టీ అడిగిన అన్ని సీట్లు ఇచ్చేందుకు అటు కాంగ్రెస్ ,ఆర్జెడి పార్టీలు నిరాకరించినట్లు సమాచారం.


సీట్ల పంపకాల విషయంలో కూటమిలో చర్చలు విఫలం అవ్వడం వల్ల బీహార్ ఎన్నికలలో తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ JMM పార్టీ తెలియజేసింది. దీంతో ఈ పార్టీ బీహార్ లోని ఆరు ప్రాంతాలలో ఒంటరిగా బరిలోకి దిగేందుకు నిర్ణయించుకుంది. నామినేషన్ దాఖలకు చివరి రోజు ఆయన నిన్నటి రోజు అనహ్యంగా ఈ పోటీ తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే బీహార్ ఎన్నికలలో ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తుందనుకున్న మహాఘట్ బంధన్ ఇప్పుడు కూటమిలో సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో పెద్ద ప్రభావం చూపించబోతున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. దీనివల్ల ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చేలా ఉంటుందనే విధంగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: