కేసీఆర్ తెలంగాణలో ఒక తిరుగులేని లీడర్ గా పేరు ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి చివరికి ప్రత్యేక రాష్ట్రం వచ్చేవరకు అలుపెరుగని పోరాటం చేసిన ధీరుడు. అలాంటి కేసీఆర్ చివరికి కాంగ్రెస్ మెడలు వంచి మరీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.  అదే ఊపుతో రెండు సార్లు ఆయన  తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. మూడవసారి కూడా అధికారంలోకి వస్తుంది అనుకుంటే చివరికి కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేసి గెలిపించారు. ఎప్పుడైతే కేసీఆర్ ఓడిపోయారో అప్పటినుంచి ఆయనకు చిక్కులు మొదలయ్యాయి. కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ కేసుల్లో తన కొడుకును ఇరికించారు. ఇదే కాకుండా లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టై జైలుకు కూడా వెళ్ళింది. ఓవైపు కేసులతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఎంపీ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ కూడా రాలేదు. ఇదంతా నడుస్తున్న సమయంలో  బీఆర్ఎస్ పార్టీపై కవిత తిరుగుభాటు జెండా ఎగురవేసింది.

 తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నారని, కేసీఆర్ కు అర్థం కావడం లేదని,పార్టీని నిండా ముంచేదాకా ఆయనకు అర్థం కాదని చెప్పుకుంటూ వచ్చింది. ఈ విధంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను ఉంటానని చెప్పుకొచ్చిన కవిత ఏదైనా పార్టీ పెడుతుంది కావచ్చు అని అందరు అనుకున్నారు. కానీ ఆమె జాగృతి పేరుతోనే ఇప్పటివరకు ప్రజల్లో తిరుగుతోంది. అయితే వచ్చే ఎలక్షన్స్ వరకైనా పార్టీ పెడుతుందని అందరూ భావిస్తున్న సమయంలో తాజాగా కవిత మాటలు విని అందరు ఆశ్చర్యపోయారు. తాను పార్టీ పెట్టే విషయంలో ఒక క్లారిటీ మాత్రం ఇచ్చేశారు. తెలంగాణ జాగృతి సంస్థను పార్టీగా మార్చడం పెద్ద విషయం ఏమి కాదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని అందరికి తెలుసు.

 వాటి పరిస్థితి ఎలా ఉందో తెలుసు..ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక కవిత మాటలను బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టినా తాను ముందుకు వెళ్లలేదని అర్థమైందో ఏమో కానీ పార్టీ పెట్టే విషయంలో కాస్త వెనకడుగు వేస్తుంది. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టి చివరికి బొక్క బోర్లా పడ్డారు.. చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఎటుగాని మనిషిలా మిగిలిపోయారు.. అయితే కవిత పరిస్థితి కూడా అలాగే అవుతుందని భావించిందో ఏమో అందుకే పార్టీ పెట్టే విషయంలో కాస్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తండ్రి మళ్ళీ ఆదరించి రమ్మంటే బీఆర్ఎస్ లోనే  కంటిన్యూ అవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: