ఆయన ఇంకా చెప్పిన వివరాల ప్రకారం – “నేను అద్దం పగలగొట్టి బయటకు దూకాను. నా వెంట ఇద్దరు యువకులు కూడా బయటకు దూకారు. కానీ మిగతావారిని రక్షించలేకపోయాం. బస్సు లోపల మొత్తం మంటల్లో మునిగిపోయింది. బైక్ ఢీకొన్న వెంటనే మంటలు బస్సును ఆవరించడంతో అందరూ గందరగోళానికి గురయ్యారు.” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నప్పటికీ అప్పటికే ఎక్కువ మంది దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది.
ప్రమాదానికి కారణం బస్సు అధిక వేగం, అలాగే బైక్‌ను గట్టిగా ఢీకొట్టడమేనని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. మరణించినవారిలో ఎక్కువ మంది దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరుకు వెళ్తున్న ఉద్యోగులు, విద్యార్థులుగా గుర్తించారు.ఈ ఘటనతో కర్నూలు జిల్లా శోకసంద్రంగా మారింది. బస్సు మిగిలిన భాగాలు, కాలిన వస్త్రాలు, వ్యక్తిగత వస్తువులు చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయి. మంటల్లో చిక్కుకున్న వారి కేకలు, చుట్టూ వ్యాపించిన మంటల ఆవిరి — ఆ దృశ్యాలు చూసిన వారిని విపరీతంగా కుదిపేశాయి .ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి