బస్సులో కొంతమంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ద్వారా బయటపడినప్పటికీ మిగిలిన వారికి డోర్ ఓపెన్ కాకపోవడంతో భారీగానే ప్రాణనష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని కలెక్టర్ సిరి తెలియజేశారు. ఈ ఘటన పైన కర్నూలు రేంజ్ ఐజి కోయ స్పందిస్తూ.. ఈ బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా లోపాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు.
ముఖ్యంగా బస్సు నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ కూడా క్వాలిటీ లేదని ఒకవేళ క్వాలిటీ ఉంటే ప్రయాణికులు ప్రాణాలతో బయటపడేవారు అంటూ తెలిపారు. బస్సు డోర్ ఇరుకుగా ఉండడం వల్ల చాలామంది బయటికి రాలేకపోయారని తెలిపారు. బస్సును తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ వల్లే ఎక్కువ ప్రమాదం జరిగిందనే అనుమానాలను తెలిపారు. అలాగే బస్సులో ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలని, బస్సు మెటీరియల్ పైన ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని తెలియజేశారు. ఈ బస్సు ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని తెలియజేశారు. అందులో కొంతమంది మాత్రం అద్దాలు పగలగొట్టుకొని ఎలాగోలాగా ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ బస్సు ఏసి స్లీపర్ బస్సు కావడం చేత మంటలకు పొగ బస్సు నిండా అలుముకొని ప్రయాణికులకు ఊపిరాడనివ్వకుండా చేసిందని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి