వాళ్లు అలాంటి వ్యక్తులు అనుకోలేదు.. వాళ్లకు టికెట్లు ఇచ్చి తప్పు చేశాను అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు  సీఎం అయిన తర్వాత కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. చివరికి ఏ చిన్న కార్యక్రమం అయినా సరే ఆయనే ప్రత్యక్షంగా పాల్గొని  ప్రజలకు ఎలాంటి నష్టం కలగకూడదనే ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా సీఎం మంచి ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం  పార్టీ ప్రతిష్టను బజారు కీడుస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహించినట్టు తెలుస్తోంది. అంతేకాదు వాళ్లు పార్టీ గుర్తుపైన గెలిచారు. ఇలా పార్టీ పరువును బద్నాం చేస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించినట్టు సమాచారం.. పార్టీకి కొన్ని సిద్ధాంతాలు కట్టుబాట్లు ఉన్నాయి. అవి తెలియని వారికి టికెట్ ఇచ్చి తప్పు చేశానని చంద్రబాబు పశ్చాత్తాప పడ్డట్టు తెలుస్తోంది. యువత కదా అని టికెట్ అందిస్తే ఇలా పార్టీకి నష్టం చేస్తున్నారని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది..మరి పార్టీకి నష్టం చేసింది ఎవరు ఆ వివరాలు చూద్దాం.. 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వచ్చినటువంటి విభేదాలు మీడియా వరకు చేరాయి. చివరికి వారి సొంత వ్యక్తిగత విభేదాలను పార్టీకి అంటగట్టి మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు. దీంతో కొంతమంది పార్టీ పెద్దలు వారి మధ్య సర్ది చేస్తామని చంద్రబాబుకు చెప్పడంతో అలా ఏమీ వద్దని , ఎవరిని బ్రతిమిలాడాల్సిన పనిలేదని క్రమశిక్షణ చర్యలు తప్పకుండా తీసుకోవాలన్నట్టు తెలుస్తోంది. ఇక వీళ్లే కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంచడానికి కూడా టైం తీసుకోవడం లేదని, కొన్ని చెక్కులు వారి దగ్గర పెట్టుకోవడం వల్ల డేటు ముగిసిపోతుందని ఆగ్రహించారు. అలాగే వరద సహాయక చర్యల్లో యాక్టివ్గా లేనటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల లిస్ట్ నాకు త్వరగా అందించాలని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని అన్నట్టు తెలుస్తోంది.

ఆయన లండన్ పర్యటన ముగిసిన తర్వాత తప్పకుండా పార్టీలో యాక్టివ్గా లేని ప్రజలకు పథకాలు అందించని ఎమ్మెల్యేలైనా, మంత్రులైన ఉపేక్షించపోమంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మద్యం వంటి వ్యాపారాల జోలికి తెలుగుదేశం పార్టీ నాయకులు అస్సలు వెళ్ళొద్దని దీనివల్ల పార్టీకి మచ్చ వస్తుందని తెలియజేసినట్టు సమాచారం. పార్టీని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల్లోనే మండల జిల్లా స్థాయి బాడీలను ఎన్నుకుంటామని హితవు పలికారు. మరి చూడాలి చంద్రబాబు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీని ఏ విధంగా  ప్రక్షాళన చేస్తారు..ఏ నాయకుని పై వేటు వేస్తారు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: