ప్రతిపక్ష విషయంలో జగన్ ఫెయిల్యూర్ అయ్యారని కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఏపీకి మంచి జరుగుతుందంటూ వెల్లడించారు. డిప్యూటీ సీఎంకు జ్ఞానోదయం అయ్యేవరకు ఎదురు చూడక తప్పదు అంటూ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పదేళ్లు గడిచినా కూడా విభజన చట్టాన్ని అమలు చేయట్లేదని ఈ విషయం పైన ప్రభుత్వం స్పందించాలి అంటూ కోరారు ఉండవల్లి. కూటమి ప్రభుత్వం వచ్చి 16 మాసాలు అవుతున్న ఇంకా చంద్రబాబు పాత తరహా పాలనే కొనసాగుతోందని తెలియజేశారు. ఏ రాష్ట్రానికైనా అవతరణ దినోత్సవం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ కీ లేకుండా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
అయితే ఈ విషయం పై మీద కొంతమంది మాత్రం కూటమిని విడదీస్తే తప్ప జగన్ కి రాజకీయ భవిష్యత్తు లేదని అందుకే ఉండవల్లి ఇలా జగన్ కు సహకారం అందిస్తున్నారు అంటూ పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలాగైనా సరే తన లాయర్ తెలివితేటలతో కూటమిని విడగొట్టాలన్నదే లక్ష్యంగా చూస్తున్నట్టు కనిపిస్తోందని కూటమి నేతలు కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి