బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కనీ వినీ ఎరగని విజయాన్ని సాధించింది.. ఏకంగా డబుల్ సెంచరీ సీట్లను గెలుచుకొని అధరహో అనిపించింది. ఇక ఎన్డీఏ కూటమి తాకిడి ముందు మహాగట్ బంధన్ కూటమి  తట్టుకోలేకపోయింది.. ఇదే ఊపుతో బీహార్ రాష్ట్రంలో  ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం, మంత్రుల కూర్పు కూడా చేయబోతోంది. మరి ఇక్కడ మంత్రి పదవులను ఏ విధంగా ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ లో ఏ ఫార్ములా ప్రకారం ఎంపిక చేశారో ఆ విధంగానే చేస్తున్నారా అనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో టిడిపి కూటమి గెలిచిన తర్వాత ఒక ఫార్ములా ప్రకారం మంత్రి పదవులు పంచుకున్నారు. అయితే ఈ ఫార్ములా బయటకు తెలియదు. ఏపీ మొత్తం 175 అసెంబ్లీ సీట్లు, మొత్తం గెలిచింది 164 సీట్లు. అయితే ఇందులో మంత్రి పదవులను 164÷7 లెక్కన మంత్రి పదవులు అందుకున్నారు. ఇందులో భాగంగానే బిజెపికి ఎనిమిది వచ్చాయి.

 కాబట్టి ఒక మంత్రి పదవిని మాత్రమే అందించారు. ఒకప్పుడు బిజెపి నాలుగు గెలుచుకున్న రెండు మంత్రి పదవులు అందించిన టిడిపి కూటమి, ఇప్పుడు 8 వచ్చినా ఒక మంత్రి పదవి మాత్రమే అందించింది. దీనికి కారణం ఏపీ కూటమిలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం. జనసేనకు 21 ఉంటే మూడు మంత్రి పదవులు ఇచ్చింది. మిగతా సింహభాగం తెలుగుదేశం పార్టీ తీసుకుంది.అయితే బీహార్ లో కూడా ఈ లెక్కనే మంత్రి పదవులు పంచుకుంటున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది.

ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీకే సింహభాగం మంత్రి పదవులు ఉండే అవకాశం కనిపిస్తోంది. బిజెపికి 15 మంత్రి పదవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎల్జేపి కి 19 వచ్చాయి కాబట్టి  3 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు ఒక్కోక్కటి చొప్పున మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా జెడియు నుంచి 14 మంత్రి పదవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో నుంచి నితీష్ కుమార్ కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: