తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పామర్రు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు. గత అయుదు సంవత్సరాల్లో ఎప్పుడు రైతు కష్టాలను తెలుసుకోని చంద్రబాబు ప్రతిపక్షంలోకి చేరిన తర్వాత రైతుల కష్టాలను, పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ ట్విట్టర్ వేధికగా గోరతి గోరంగా చంద్రన్నని అవమానించారు.                                                                                                


ఓ నెటిజన్ స్పందిస్తూ 'చంద్రన్న ఆపన్న నీ డ్రామాలు' అని ఒకరు కామెంట్ చేస్తే మరికొందరు స్పందిస్తూ 'ఏంటి చంద్రయ్య ఈ డ్రామాలు.. గత అయుదు సంవత్సరాల్లో నువ్వు ప్లే చేసిన డ్రామాలు చాలు చంద్రన్న.. ఇంకా ఆపు. ప్రజలందరికి గత అయిదేళ్లలో నువ్వు టోపీలు పెట్టేశావ్.. ఇప్పుడు కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. వేళ్ళు రెస్ట్ తీసుకో అని కొందరు కామెంట్లు పెట్టారు. 


మరి కొందరు స్పందిస్తూ 'చంద్రన్నని చూస్తుంటే మారిపోయినట్టు కనిపిస్తున్నారే' అని డైలాగ్ లు వినిపిస్తున్నాయి. మరి కొందరు స్పందిస్తూ 'ఏంటి చంద్రన్న .. మీరు ప్రతి పక్షంలో ఉంటె కేవలం పరామర్శిస్తారా ? ఎవరికి సహాయం చెయ్యరా ?.. మీ కొడుకు ఏమో ఎప్పుడు ట్విట్టర్'లోనే ఉంటారు' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.  


మరి ఈ వ్యాఖ్యలపై చంద్రన్న స్పందిస్తారా ? లేక ఏవి మాములే అనుకుంటారా అనేది చూడాలి. ఏది ఏమైనా 70 యేలు వయసు వచ్చిన చంద్రన్న చిల్లర రాజకీయాలు మానడం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.    



మరింత సమాచారం తెలుసుకోండి: