రాజకీయ నాయకులూ రోజు రోజుకు సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడుతున్నారు. ఒక మహిళా గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అయితే   ఉత్తరప్రదేశ్ లో పరస్పరం తలపడుతున్న జయప్రద, అజాంఖాన్ ల మాటల యుద్ధం అగ్లీగా మారింది. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండి, ఇప్పుడు రాంపూర్ నుంచి వేర్వేరు పార్టీల తరఫున పోటీ పడుతున్న వీళ్లు విమర్శలు చేసుకొంటూ ఉన్నారు. తనపై అజాం ఖాన్ దాడి హెచ్చరికను చేశారని, తనపై యాసిడ్ పోస్తానంటూ ఆయన బెదిరించారని చెప్పారు జయప్రద.


ఆమెపై అజాంఖాన్ తీవ్రంగా స్పందించారు.  అనుచితంగా మాట్లాడారు. 'జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది నేనే. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని మాత్రం గుర్తించలేకపోయా..' అంటూ అజాంఖాన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉన్నాయి. ఒక మహిళా  రాజకీయ నేతల పట్ల అలాంటి వ్యాఖ్యలు గర్హనీయమైన పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.


ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు కానీ.. ఇలాంటి సెక్సీ కామెంట్లు మాత్రం సబబు కాదని చెప్పవచ్చు. కొన్నాళ్ల కిందట జయప్రద సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కృతురాలు అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె వివిధ రాజకీయ ప్రయత్నాలు చేసి బీజేపీ తరఫున టికెట్ సంపాదించారు. తను గతంలో ప్రాతినిధ్యం వహించిన రాంపూర్ నుంచినే కమలం పార్టీ తరఫున రంగంలోకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: