గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించిన ఫిరాయింపు రాజకీయాలపై ఏపీ ముఖ్యమంత్రి గా అసెంబ్లీ సాక్షిగా విమర్శల వర్షం కురిపించారు.  మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబును సూటిగా నిలదీస్తూ ఆయన  ఫిరాయింపు రాజకీయాన్ని  కడిగిపారేశారు.  23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తెలుగుదేశం లోకి లాక్కొని కొందరిని  మంత్రులను చేసిన వైనాన్ని   నిలదీశారు.

 

 

అసెంబ్లీలో గతంలో జరిగిన పరాభవం  పదే పదే గుర్తు చేస్తూ తాము అలాంటి నీచ రాజకీయం చేయబోమని   తేల్చి చెప్పేశారు.  ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో సంకట పరిస్థితి ఎదుర్కొన్నారు.   నీలా చేస్తే నాకు నీకు తేడా ఏముంటుంది అంటూ జగన్ నేరుగా  దెప్పి పొడుస్తూ ఉంటే..  సమాధానం చెప్పలేక  నీళ్లు నమిలారు.

 

గత అసెంబ్లీలో రాజకీయం దిగజారిన  తీరును జగన్ ఆవేశపడకుండా  తూటాల వంటి  మాటలతో  ఎండగడుతూ ఉంటే సమాధానం చెప్పలేక..  చేసిన తప్పు పోలేక.. పోనీ  చేసిన దాన్ని  ఒప్పుకునే ధైర్యం లేక   చంద్రబాబు విలవిలలాడిపోయారు.  గతంలో తాను చాణక్యనీతి అనుకున్నది  ఎంతటి భ్రష్ట రాజకీయమో..  దాదాపు తన అనుభవమంతా వయసున్న ఓ యువకుడు బయట పెడుతుంటే సిగ్గుతో బిక్క చచ్చిపోయాడు. 

 

చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాన్ని జగన్ కడిగిపారేసిన తర్వాత మాట్లాడే అవకాశం వచ్చినా ఆయన జగన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.   రాజకీయాల్లో గెలుపోటములు సహజం అంటూ రొటీన్ డైలాగులు చెప్పారు కానీ..  జగన్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సాహసం చేయలేకపోయారు.   40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి నాయకుడికి ఇలాంటి దృష్టికి  రావడానికి కారణం స్వయం కృతాపరాధం కాదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: