ప్రస్తుతం టీమిండియా జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడుతుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ఇక అద్భుతంగా రాణిస్తుంది. దీంతో ఇక లంక గడ్డపై శ్రీలంక జట్టుపై ఆధిపత్యాన్ని సాధించింది యంగ్ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు. ఈ వన్డే సిరీస్ లో భాగంగా మొదటి ఎంతో అద్భుతంగా రాణించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండవ వన్డేలో ఓటమి ఖాయం అనుకున్న సమయంలో భారత బౌలర్లు విజృంభించి బ్యాటింగ్ చేసి ఆశ్చర్యపరిచారు.



 ఈ క్రమంలోనే ఇక టీమిండియా రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. దీంతో ఇక లంక జట్టుఫై ఆధిపత్యాన్ని సాధించింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే  వన్డే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఇటీవలే మూడవ వన్డే లో బరిలోకి దిగింది. అయితే మొదటి వన్డే మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ రెండవ వన్డే మ్యాచ్లో మాత్రం నిరాశ పరిచాడు. మూడో వన్డే మ్యాచ్ లో కాస్త దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించినప్పటికీ చివరికి పేలవ రీతిలో వికెట్ చేజార్చుకునీ అభిమానులను నిరాశ పరిచాడు. రెండవ ఓవర్లో లంక స్పిన్నర్ ధనంజయ బౌలింగ్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు శిఖర్ ధావన్ .



 ఈ క్రమంలోనే 9 బంతుల్లో 14 పరుగులు చేశాడు. కానీ అంతలోనే ఒక పేలవ షాట్ కి ప్రయత్నించి చివరికి అవుట్ అయిపోయాడు. రెండవ ఓవర్లో ఎంతో దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్ ఇక ఇన్నింగ్స్ లోని 3 ఓవర్లలో మాత్రం వికెట్ కోల్పోయాడు. ముడవా ఓవర్ లో మూడవ బంతిని ఆప్స్ స్టేంప్స్ వెలుపలగా విసిరాడు బౌలర్  . ఆ సమయంలో ఎలాంటి  పాదాల కదలిక లేకుండా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించగా.. చివరికి బ్యాట్ ఎడ్జ్ కి తాకి  కీపర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో అప్పటివరకు దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్ చివరికి వికెట్ కోల్పోయి నిరాశతో పెవిలియన్  వైపు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: