ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది.  అయితే మొదట భారత్ వేదిక ఈ టి20 వరల్డ్ కప్ జరుగుతుంది అని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య భారత్  వేదికగా కాకుండా బిసిసిఐ, ఐ సి సి చర్చించుకుని యూఏఈ వేదికగా  టి20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే  ఈ టి20 వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూలు కూడా విడుదలైంది.  అయితే అటు ఐసీసీ క్రికెట్ ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడంతో చాలామంది క్రికెట్ ప్రేక్షకులు స్టేడియం కి వెళ్లి మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించడానికి సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ఇక టీవీలకు అతుక్కు పోవడానికి రెడీ అవుతున్నారు.



 అయితే ప్రత్యక్షంగా స్టేడియంలో మ్యాచ్ వీక్షించిన దానికంటే అదిరిపోయే మజా రావాలి అంటే థియేటర్లో మ్యాచ్ చూస్తే ఎలా ఉంటుంది.  సాధారణంగా థియేటర్ లో కొత్త సినిమా చూస్తేనే ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ప్రతి నిమిషం కూడా ఉత్కంఠభరితంగా సాగే టి20 వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తే ఆ అనుభూతిని మాటల్లో వివరించలేము కూడా. కానీ అలాంటిది కుదురుతుందా అంటే చాలా మటుకు అయితే కుదరదు. ఎందుకంటే థియేటర్లలో క్రికెట్ మ్యాచ్ ప్రసారం చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపరు. కానీ ఇప్పుడు మాత్రం క్రికెట్ ప్రేక్షకులందరికీ ఇలాంటి ఒక అదిరిపోయే శుభ వార్త అందింది.



 ఇక నేను చెప్పే వార్త వింటే ఇక నుంచి స్టేడియం కి వెళ్లి మ్యాచ్ వీక్షించాలి అనుకోవడం కాదు థియేటర్కు వెళ్లి మ్యాచ్ వీక్షించాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లను థియేటర్లలో ప్రదర్శిస్తాము అంటూ ఇటీవల మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ ఐనాక్స్ లీజర్ తెలిపింది. అన్ని ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్స్ లో లీగ్ దశ నుంచి భారత మ్యాచ్లను చూసే విధంగా థియేటర్లను అందుబాటులోకి తీసుకు వస్తాము అంటూ తెలిపింది. దీంతో ప్రేక్షకులందరికీ స్టేడియం లో కూర్చొని చూస్తున్న అనుభూతి కలుగుతుంది అంటూ తెలిపింది అయితే నగరాన్ని బట్టి టికెట్ ధర 200 రూపాయల నుండి 500 వరకు ఉంటుందని తెలిపింది. కాగా ఐనాక్స్ కి  దేశ వ్యాప్తంగా 70 నగరాల్లో థియేటర్లు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: