టీ ట్వంటి ప్ర‌పంచ కప్ టోర్ని కి టీమిండియ మెంట‌ర్ గా మాజీ కెప్టెన్ మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే మిస్ట‌ర్ కూల్ ధోని ప్ర‌పంచ క‌ప్ టోర్న మెంట్ లో టీమిండియా తో ఉంటే జట్టు కు కాస్త ఒత్తిడి త‌గ్గు తుంద‌ని బీసీసీఐ భావించింది. అలాగే మ‌హేంద్ర సింగ్ ధోని అనుభ‌వం టీమిండియా చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనుకున్నారు. పై గా ధోని సార‌థ్యం లో టీమిండియా చాలా వ‌ర‌కు ఐసీసీ క‌ప్ ల‌ను గెలిచింది. అంతే కాకుండా ధోని కెప్టెన్ గా ఉన్న స‌మ‌యంలో ఐసీసీ నిర్వ‌హించే మ్యాచ్ ల‌లో కూడా గెలుపు శాతం ఎక్కువ గానే ఉంది. అందు కోసమే ధోని ని టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ స‌మయంలో టీమిండియా కు మెంట‌ర్ గా నియ‌మించారు. అయితే దీని కోసం మ‌హేంద్ర సింగ్ ధోని ఎలాంటి డ‌బ్బు తీసు కోవ‌డం లేదు.



ఇదీలా ఉండ‌గా యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ టోర్న మెంట్ లో టీమిండియా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్ లు ఆడింది. అయితే ఈ ఆడిన రెండు మ్యాచ్ లు కూడా దారుణంగా ఓడిపోయింది. టీమిండియా  మొద‌టి అక్టోబ‌ర్ 24 న‌ మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్ల తేడ‌తో ఓడిపోయింది. తాజ‌గా  ఆది వారం న్యూజిలాండ్ తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో కూడా 8 వికెట్ల తేడ‌తో ఓట‌మి పాల‌యింది. అయితే  ఆడిన రెండు మ్యాచ్ ల‌లో క‌నీస ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వక పోవ‌డం పై దేశ వ్యాప్తంగా చాలా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌న ఆట‌గాళ్లు అంద‌రు క‌లిసి కొట్టిన స్కోరు ను ప్ర‌త్య‌ర్థులు అల‌వ‌కగా కొట్టేస్తున్నారు. దీంతో టీమిండియా స‌రైన ప్లాన్ లేకుండా ఆడుతుంది అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే ఆడిన రెండు మ్యాచ్ లు ఓడ‌టం ప‌ట‌ల మెంట‌ర్ గా వ్య‌వ‌హరిస్తున్న ధోని కూడా భాద్య‌త వ్య‌వ‌హ‌రించాల‌ని అంటున్నారు. అయితే ధోని మెంట‌ర్ మార్క్ జ‌ట్టు లో క‌నిపించ‌డం లేద‌ని ప‌లువురి క్రికెట్ విశ్లేష‌కుల వాద‌న‌.




మరింత సమాచారం తెలుసుకోండి: