బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా వేలంలో సీనియర్ ఆటగాళ్ల కంటే యువ ఆటగాళ్లు ఎక్కువగా సత్తా చాటారు. ఇక ఎప్పటిలాగానే యువ ఆటగాళ్లు ఏకంగా కోట్ల రూపాయల ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే  తమ ప్రాంతం నుంచి ఏ క్రికెటర్ ఎంపికయ్యాడా అని దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా మెగా వేలం వీక్షించారు. ఇక పోతే ఇక మెగా వేలంలో హైదరాబాద్ నుంచి ఒక ఆటగాడు ముంబై ఇండియన్స్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు అని తెలుస్తోంది. గతంలో హైదరాబాద్లో ఒక ఆటో తోలుకుంటూ జీవనం సాగించే వ్యక్తి  కొడుకు మహమ్మద్ సిరాజ్ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత సత్తా చాటి ఇప్పుడు స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.


 ఇక ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం ఐపీఎల్ మెగా వేలం లో తిలక్ వర్మ అనే యువ ఆటగాడు జాక్పాట్ కొట్టేసాడు. 20 లక్షలు కనీస ధర తో మెగా వేలంలో పాల్గొన్నాడు ఈ ఆటగాడు. అయితే ఇతని కోసం అన్ని జట్లు ఎంతగానో పోటీపడ్డాయి.  హైదరాబాద్ రాజస్థాన్ చెన్నై ముంబై ఫ్రాంచైజీలు  పోటీపడగా ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో ఛాంపియన్గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఇతని దక్కించుకుంది  ఇక 20 లక్షలతో మెగా వేలంలో పాల్గొన్న ఆటగాడికి చివరికి తీవ్రమైన పోటీ మధ్య 1.79 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.


. అయితే ఈ హైదరాబాద్ ప్లేయర్ కు  ఇంత డిమాండ్ రావడానికి కారణం ఇటీవలే జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో అద్భుత ప్రదర్శన చేయడం అన్నది తెలుస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ లో ఢిల్లీపై 139 పరుగులు చేసి అదరగొట్టాడు ఇందులో 7 ఫోర్లు 4 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన కారణంగానే ఐపిఎల్ ఫ్రాంచైజీలు ఇతని కోసం తీవ్రంగా పోటీ పడ్డాయని తెలుస్తోంది. ఛాంపియన్ జట్టయినా ముంబై ఇండియన్స్ లో చోటు దక్కించుకున్న యువ ఆటగాడు ఎలా రాణిస్తాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: