పృథ్వీ షా   భారత్ క్రికెట్ లో ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన పృథ్వీషా తక్కువ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారసుడు అంటూ ఎంతో మంది పృథ్వీ షా పై ప్రశంసల వర్షం కురిపించారు.. అయితే కొన్నాళ్లపాటు అద్భుతంగా రాణించిన పృథ్వీషా ఆ తర్వాత మాత్రం నిలకడ లేమి కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు.  తర్వాత భారత్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా తనని తాను నిరూపించుకోవడం లో  పృథ్వీషా పూర్తిగా విఫలం అవుతున్నాడు అని చెప్పాలి.


 దీంతో బీసీసీఐ ఇక పృథ్వీ షాకు అవకాశాలు ఇవ్వడం కూడా కాస్త తగ్గింది. దీంతో భారత జట్టు పూర్తిగా దూరం అయిపోయాడు. మొన్నటికి మొన్న రంజీ ట్రోఫీలో ఆడిన సమయంలో కూడా అనుకున్నంత మంచి ప్రదర్శన మాత్రం చేయలేదు పృథ్వీ షా. తన బ్యాటింగ్ వైఫల్యమే గురించి అతనె సోషల్ మీడియా వేదికగా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఇక అటు ఐపీఎల్ ప్రారంభానికి ముందు పృథ్వీ షా ఫిట్నెస్ టెస్ట్  లో కూడా విఫలం కావడంతో ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నది కూడా అనుమానంగానే మారిపోయింది.


 కానీ ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ అయినప్పటికీ ఐపీఎల్ లో ఛాన్స్ కొట్టేసిన పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. వరుస హాఫ్ అర్ధ సెంచరీలతో అదరగొడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే పృథ్వి షా పై ప్రశంసలు కురిపించాడు ఢిల్లీ కోచ్ రికీపాంటింగ్. అతని ఆట తీరు చూస్తుంటే తన అంత ప్రతిభ ఉంది అనిపిస్తోందని.. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చని ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ పాడ్ కాస్ట్ లో తెలిపాడు రికీ పాంటింగ్. టీమిండియా తరుపున 100 టెస్టులు ఆడేలా అతడిని తీర్చిదిద్దాలి అని అనుకొంటున్నాను అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl