మహిళా క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అటు ఐపీఎల్ తరహాలోనే మహిళా క్రికెటర్ లకు కూడా ఒక ప్రత్యేకమైన లీగ్ నిర్వహించాలని నిర్ణయించింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా మహిళల టి20 క్రికెట్ లీగ్ వాయిదాపడుతూ వచ్చింది అనే విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో చివరికి మహిళల టీ-20 ఛాలెంజ్ టోర్నీ ప్రారంభమైంది. ఇటీవలే ఈ టోర్నీలో భాగంగా  ఆసక్తికరంగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఒక బౌలర్ బౌలింగ్ యాక్షన్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పాలి.


 వెలాసిటీ స్పిన్నర్ సోనావనే ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ తో అందరిని ఆశ్చర్యపరిచింది.  సోనావనే బంతిని డెలివరీ చేసేటప్పుడు తన తలను బాగా కిందకు వంచి బౌలింగ్ చేస్తూ ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు   కొడుతోంది. ఇక ఈ మహిళా క్రికెటర్ బౌలింగ్ యాక్షన్ చూసి క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మహిళా క్రికెటర్ బౌలింగ్ యాక్షన్ మాజీ దక్షిణాఫ్రికా స్పిన్నర్  పాల్ ఆడమ్స్ బౌలింగ్ యాక్షన్ తో  పోల్చి చూస్తూ ఉండటం గమనార్హం. ఏదేమైనా ఇక తన విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది సోనావనే


 ఇక మ్యాచ్ విషయానికి వస్తే సూపర్నోవాస్ పై ఏడు వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించడం గమనార్హం.  ఈ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది సూపర్నోవాస్. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇక సూపర్నోవా బ్యాటర్ లలో హర్మన్ ప్రీత్ కౌర్ 71 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఛేదనకు  దిగిన వెలాసిటీ జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  ఇందులో షెఫాలీ వర్మ 51, లారా 51 పరుగులతో రాణించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: