ప్రత్యర్ధులు చేసే సవాలును స్వీకరించే ధైర్యం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఏనాడూ లేదు. ఆస్తుల విషయంలో సిబిఐ విచారణకు వైసిసి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చంద్రబాబును సవాలు విసిరిన విషయం అందరికీ తెలిసిందే. విజయసాయి విశాఖపట్నంలో చందాలు వసూలు చేస్తున్నాడని, దందాలు మొదలుపెట్టాడంటూ చంద్రబాబు అండ్ కో విపరీతమైన ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఇదే విషయమై విజయసాయి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు సవాలు విసిరారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యర్ధుల సవాలును చంద్రబాబు ఏరోజూ స్వీకరించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎంతసేపు తాను నిప్పునని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవటమే చంద్రబాబుకు తెలిసింది. విచిత్రమేమిటంటే చంద్రబాబు నిప్పులాంటి వాడని, ఎక్కడా అవినీతికి పాల్పడింది లేదని టిడిపి నేతల్లో కూడా ఎవరూ గట్టిగా చెప్పలేరు. ఎందుకంటే కళ్ళముందే ఓటుకునోటు వ్యవహారం కనబడుతోంది కాబట్టే. సాంకేతికంగా చట్టానికి, న్యాయస్ధానం నుండి తప్పించుకోవటంలో చంద్రబాబు తర్వాతే ఇంకెవరైనా అనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

ఇటువంటి పరిస్ధితుల్లో వైసిపి ఎంపి సవాలును చంద్రబాబు స్వీకరిస్తాడని ఎవరూ అనుకోవటం లేదు. ఏదో నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ మూడుసార్లు ముఖ్యమంత్రయిపోయాడు కానీ ప్రత్యర్ధులను నేరుగా ఎదుర్కొనేంత ధైర్యం చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. తనకు సమస్యగా మారుతాడు అని ఎవరి గురించైనా చంద్రబాబుకు అనుమానం వస్తేచాలు తనకు మద్దతుగా నిలబడే మీడియాను ఉసిగొల్పుతాడు. ఇక సదరు నేతపై బురదచల్లటం, గబ్బు పట్టించటం చివరకు ఆ నేతను తన దగ్గరకే వచ్చేట్లుగా  చంద్రబాబు చేసుకుంటాడు.

 

కాబట్టి ఇపుడు కూడా వైసిపి ఎంపి సవాలును స్వీకరించే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఎంతసేపు ప్రత్యర్ధులను టిడిపిలోని ఇతర నేతలు సవాళ్ళు చేస్తారే కానీ చంద్రబాబు చేయడు. చంద్రబాబు రాజకీయం ఎంతసేపు ప్రత్యర్ధులపై బురదచల్లటంపైనే ఉంటుంది. జనాలను మాయచేసి ప్రత్యర్ధులపై అబద్ధాలు చెప్పటంతోనే 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని గడిపేశాడు. తనకు కోర్టులు కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకోవటమే కానీ ఏ కోర్టు ఏ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందో మాత్రం చెప్పడు.

 

నిజంగానే కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చింది వాస్తవమే అయితే మరి ఓటుకునోటు కేసులో విచారణ ముందుకు సాగకుండా పదే పదే ఎందుకు అడ్డుకుంటున్నట్లు ? ఓటుకునోటు కేసులో తెచ్చుకున్న స్టే ఉత్తర్వులను తొలగించుకుని విచారణకు రెడీ అవమని వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా చంద్రబాబు నుండి సమాధానమే రాలేదు. కాబట్టి అవినీతి విషయంలో  సిబిఐ  విచారణకు చంద్రబాబును సవాలు చేయటం దండగే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: