ప్రస్తుతం మనం పాశ్చాత్య సమాజం లో బ్రతుకుతున్నాము. ఇటీవల కాలంలో చాలా మంది ఫ్యాషన్ కి అలవాటు పడ్డారు కాబట్టి , మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడుకున్న కాటుకతో కళ్ళకు దిద్దు కుంటున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ పెట్టేసి ఆ కాటుక ను వివిధ రకాలుగా కెమికల్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇక ఈ కాటుక వల్ల కళ్ళు అందంగా కనిపించడం పక్కన పెడితే, దీని వల్ల కళ్ళకు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి..


మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళగౌరీ వ్రతం లో భాగంగా తయారుచేసే కాటుకను ధరించడం అనేది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రావణ మాసంలో మంగళవారం రోజున జరుపుకునే మంగళ గౌరీ వ్రతం లో గౌరీ మాత కాటుక ప్రతిరోజు ఉపయోగించడం వల్ల, కళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా కళ్ళకు  ఏర్పడిన దృష్టిలోపం కూడా పోతుంది. సైంటిఫిక్ పరంగా చెప్పాలి అంటే మనం ఇంట్లో స్వయంగా తయారు చేసుకొనే, ఈ కాటుక లో ఎలాంటి రసాయనాలు ఉండవు.. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు.

హిందూ శాస్త్రం ప్రకారం మంగళ గౌరీ మాత మీద నమ్మకంతో ఆ కాటుకను ఎప్పుడైతే స్త్రీలు ధరిస్తారో.. వారికి సంతానము, భర్త, కుటుంబము ఇలా అన్నీ కూడా సుఖంగా ,సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించడమే కాకుండా స్త్రీలు కూడా సౌభాగ్యవతులై,  ఆయురారోగ్యాలతో నిండు కాలం జీవిస్తారు. అందుకే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళ గౌరీ కాటుక అనే వ్రతాన్ని కూడా సౌభాగ్యవతులు  చేపడుతూ ఉంటారు.

అయితే ఈ కాటుకను ఎలా తయారు చేయాలి అంటే. మంగళ గౌరీ పూజను మనం ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేసి,  అమ్మవారికి వరి పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ వరి పిండి ప్రమిదను ఎలా తయారు చేయాలి అంటే, వరి పిండిలో పచ్చిపాలు, ఏలకులపొడి, బెల్లం పొడి, నెయ్యి వేసి బాగా కలిపి దానిని ప్రమిద లా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రమిద కు కుంకుమ బొట్లు పెట్టి.. తమలపాకు మీద పెట్టి, ఆవు నెయ్యితో జ్యోతిని వెలిగించాలి.
ఇప్పుడు ఒక శుద్ధమైన ఇత్తడి గరిట తీసుకొని , ఆ వెలుగుతున్న జ్యోతికి అంటకుండా కప్పి ఉంచేలా గరిటను పెట్టాలి. దీపం కొండెక్కే వరకు అలాగే ఉంచాలి. ప్రమిదలో ఉన్న నూనె మొత్తం దీపం లా  వెలిగి చివరకు కొండెక్కుతుంది. అప్పుడు నెమ్మదిగా ఆ గరిటను తీసి, అందులో నల్లగా పేరుకుపోయిన పొడిని , ఒక అర చేతిలోకి తీసుకొని,  రెండు చుక్కలు నెయ్యి , పచ్చకర్పూరం వేసి బొటన వేళ్ళతో బాగా అరగదీయాలి. ఇప్పుడు మనకు మంగళ గౌరీ దేవి కాటుక తయారవుతుంది. ఈ కాటుకను కళ్ళకు ధరించడం వల్ల ఇందులో  అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.. కాబట్టి దృష్టి పెరగడంతోపాటు శరీర పుస్టి కూడా పెరుగుతుంది అని పెద్దల నమ్మకం. కాదు చిన్న పిల్లలకు కూడా ఎటువంటి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: