శిరస్సు లేకుండా ఎప్పుడైనా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుందా..? లేదా ఎవరైనా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా శిరస్సు లేని దర్శనమిచ్చే అమ్మవారిని చూశారా..? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా కచ్చితంగా శిరస్సు లేకుండా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు కూడా ఒకచోట కొలువై ఉన్నారట.. అయితే ఈ విధంగా అమ్మవారి తల లేకుండా పోవడానికి గల కారణం ఏమిటి..? అనే విషయాలను మనం ఒకసారి చర్చించుకుందాం..సాధారణంగా మన భారతదేశంలో అష్టాదశ పీఠాలు గురించి ఎన్నోరకాలుగా తెలుసుకున్నాము.. అలాగే చూసే ఉంటాం.. అష్టాదశ శక్తిపీఠాల కారణంగా మన దేశంలో ఎటువంటి విపత్తులు తలెత్తకుండా దేశం సుసంపన్నంగా, సస్యశ్యామలంగా ఒక వెలుగు వెలుగుతోంది  అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో మంది భక్తులు ఈ అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించి, తమ కోరికలను నెరవేర్చుకుంటారు.. అత్యంత ప్రముఖమైన శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లే.. శిరస్సు లేని అమ్మవారు అయిన చిన్తపూర్ణి ఆలయం హిమాలయాల్లో కొలువై ఉంది.అంతే కాదు ఇక్కడ కొలువై ఉన్న ఆలయానికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. అమ్మవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు.. ఈ శక్తి పీఠములో పరాశక్తియై.. తన భర్త అయిన కాలభైరవుడి కి తోడుగా కొలువై ఉంటుంది..ఇక్కడ అమ్మవారికి శిరస్సు లేకపోవడానికి గల కారణం ఏమిటి..?  అనే విషయానికి వస్తే పురాణాలు చెప్పిన ప్రకారం శ్రీ మహావిష్ణువు, పార్వతీ దేవి కాళ్ళను తన సుదర్శన చక్రంతో ఖండించిన అప్పుడు అమ్మవారి యొక్క శరీరంలోని పాదాలు చిన్తపూర్ణి లో పడ్డాయి అని చెబుతారు.అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా ఒక పిండి రూపంలో మనకు దర్శనం ఇవ్వడం గమనార్హం .. ఎవరైతే అమ్మవారిని భక్తి భావంతో కొలుస్తారో.. వారి కోరికలను తప్పకుండా నెరవేరుతాయి అని భక్తుల విశేష నమ్మకం. అంతేకాదు ఈ ఆలయంలో అమ్మవారు శిరస్సు లేకుండా కొలువై ఉండడం వల్ల అమ్మవారిని చిన్ మస్తికా దేవిగా కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు.. ఇక మార్కండేయ పురాణం ప్రకారం చండీదేవి కి అసురులకు మధ్య జరిగిన ఒక భీకరయుద్ధంలో చండీదేవి రాక్షసులను సంహరిస్తూ ఉంది.. అయితే ఈ యుద్ధంలో అమ్మవారికి సహాయంగా వచ్చిన యోగిని, డాకినీ గా పిలువబడే జయ విజయములు ఎంతో మంది అసురులను చంపి వారి రక్తాన్ని తాగుతారు..అంతమంది రాక్షసుల రక్తాన్ని తాగినా కూడా ఆ ఇద్దరి దేవతల దాహం తీరదు.. ఇక దానితో చండీ దేవి స్వయంగా తన శిరస్సును ఖండించుకొని వారిద్దరికీ.. అమ్మవారి శరీరం నుంచి వచ్చే రక్తం ద్వారా వారి యొక్క దాహాన్ని తార్చింది. అందుకే ఇక్కడ అమ్మవారిని చిన్ మస్థికా దేవి అని పిలుస్తారు.. అంటే చిన్ అంటే లేదు అని మస్తిష్క అంటే తల అని ,తల లేని అమ్మవారిగా పిలుస్తూ ఉంటారు.. అంతేకాదు పురాణాల ప్రకారం పరమశివుడు ఈ ప్రదేశాన్ని నాలుగు దిక్కులు కాపాడుతూ ఉంటాడు అని ప్రజల ప్రగాఢ విశ్వాసం.



మరింత సమాచారం తెలుసుకోండి: