శ్రావణ శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు.ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇల్లు వాకలి శుభ్రం చేసుకొని, లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో పూజించుకోవడం వల్ల,మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లోకి పాకుతాయి.మరియు నెగటివ్ ఎనర్జీని చిటికెలో పారిదోలే చిట్కా ఏంటంటే,ఒక ఒక గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు,కుంకుమ వేసి అందులోనే గుప్పెడు రాళ్ల ఉప్పును కూడా వేయాలి. అలా వేసిన తరువాత నిమ్మ పండును లక్ష్మీదేవికి ఎదురుగా ఉంచి పూజించి ఆ నిమ్మ పండును తెచ్చి,ఆ గాజు గ్లాస్ లోనే ఉంచాలి.ఈ గాజు గ్లాసును గుమ్మానికి ఎదురుగా ఉంచాలి.ఇది ఎలా ఉండాలి అంటే ఎవరైనా ఇంట్లోకి వస్తూనే ఆ గాజు గ్లాసు కనిపించేలా ఉండాలి.దీని ద్వారానే బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు వారి నుంచి కలిగే నెగటివ్ ఎనర్జీ ఆ గాజు గ్లాసుపై పడి అంతమవుతుంది.
ఇంకా ముఖ్యంగా కొత్త ఇంటిని ఎవరైనా నిర్మించుకునే వారు కానీ,ఆల్రెడీ ఉన్న ఇంట్లోనైనా సరే గుమ్మానికి ఎదురుగా అద్దాన్ని ఏర్పాటు చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే బయట నుంచి ఇంట్లోకి వచ్చేవారు వారి ముఖాన్ని వారే చూసుకోవడం వల్ల, మీ ఇంటికి దిష్టి తగిలే అవకాశాలు తొలగిపోతాయట.కావున ప్రతి ఒక్కరూ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలి అనుకుంటే ఈశ్రావణ శుక్రవారం పూట ఇలా చేయండి అన్ని శుభాలే కలుగుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి