మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాల్లో దీపం పెట్టడం అనేది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నది.ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టుగా,అ ఇల్లాలి చేత దీపం వెలిగించబడే ఇళ్లల్లో సుఖసంతోషాలు,అష్ట ఐశ్వర్యాలు,అదృష్టాలు కలిసి వస్తాయని గట్టిగా నమ్ముతాము.అలాంటి దీపాలనుసాధారణంగా ఆముదం నూనెతో కానీ, పంచాయిలతో కానీ,నువ్వుల నూనెతో కానీ వెలిగిస్తూ ఉంటాము.ఈరోజు నూనెలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.అదే కోవలోకె నెయ్యి దీపం కూడా వస్తుంది.ఈ నెయ్యి దీపం రోజు వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు కూడా ఇలాగే చేస్తారు మరి అవేంటో చూద్దామా..

సాధారణంగా చుట్టూ ఉన్న గాలి నుంచి సాత్విక ప్రకంపనలను కలిగించే శక్తి నెయ్యి దీపాలకు ఉంది. ఒక వేళ ఈ దీపం కొన్ని గంటల తరువాత వెలగడం ఆగిపోయినా సరే వాతావరణ సాత్విక గుణాన్ని ఈ దీపం ప్రభావితం చేస్తుంది.ఈ నెయ్యి దీపం కాంతి ఇంటికి పురుగుమందులా పనిచేస్తుంది.దీని నుంచి వచ్చే పొగ వాతావరణంలో బ్యాక్టీరియా,వైరస్‌ సంఖ్యను తగ్గిస్తుంది.ఈ నెయ్యి దీపంను మట్టి ప్రమీదలో, ఆవు నెయ్యి వేసి వెలిగించడం మరింత ఉత్తమం.

లక్ష్మీదేవి కటాక్షం..

ఇంట్లో నేతి దీపం వెలిగించడం అనేది అత్యంత మంగళకరమైనది.మరీ ముఖ్యంగా ప్రతిరోజు సంధ్యా సమయంలో వెలిగించడం వల్ల ఇంటికి అనుకూల శక్తులు లభించడమే కాక,వాస్తు దోషాలకు కూడా నివారణ కలుగుతాయి.మరియు ఇంట్లోని వారిపై లక్ష్మీదేవి కటాక్షం కలుగుతాయి.

దుష్టశక్తుల నిరోధకం..

నెయ్యి దీపం ఇంట్లో వెలిగించడంతో చెడుపై మంచి గెలుస్తుంది. దీనితో ఇంట్లోని వారిలో మనశాంతి, సంతోషాన్ని పెంపొందిస్తుంది.మరియు మెరిసే దీప కాంతి వల్ల దుష్టశక్తులను దూరం చేస్తుందని,మానసిక స్పష్టతను పెంపొందిస్తుందని చాలా మంది నమ్ముతారు కూడా.


సానుకూల శక్తి..

నెయ్యి వెలిగించడంతో వచ్చే సువాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.దీనితో చెడు వాసనలను దూరం చేస్తుంది.అ దీపపు పరిసరాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది.ఈ దీపాలకు సానుకూలతను స్వాగతించడానికి,విశ్వం నుంచి ప్రతికూల శక్తిని తరిమికొట్టే శక్తి ఉందని హిందువుల నమ్ముతాము కూడా.

కావున ఇన్ని లాభాలను పొందాలంటే మీరు కూడా నెయ్యి దీపం పెట్టుకొని లక్ష్మి దేవి అనుగ్రహం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: