ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. జూన్ 28న పాక్ , ఇంగ్లాండ్ లో అడుగుపెట్టాల్సి వుంది. దానికి ముందు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా  షాదాబ్ ఖాన్ , హారిస్ రాఫ్ , హైదర్ అలీకి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరిని సెల్ఫ్ ఐసోలేషన్ లో వుంచారు అయితే ఈముగ్గురికి కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఇక ఇమాద్ వసీం ,ఉస్మాన్ షిన్వారి లకు నెగిటివ్ రాగ మిగిలిన ఆటగాళ్ల రిపోర్ట్స్ రావాల్సి వుంది.  
 
పాజిటివ్ వచ్చిన ఈముగ్గరు ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనకు అందుబాటులో ఉండేది అనుమానమే.. ఆగస్టు -సెప్టెంబర్ లో పాక్ ,ఇంగ్లాండ్ తో మూడు టెస్టులు ,మూడు టీ 20ల్లో తలపడాల్సివుంది. ఇక ఈపర్యటన కు మొత్తం 29ఆటగాళ్లతో కూడిన జట్టు ను ప్రకటించింది పీసీబీ. హైదెర్ అలీ జాతీయ జట్టు కు ఎంపిక కావడం ఇదే మొదటిసారి. పాక్ టెస్టు జట్టు కు అజార్ అలీ టీ 20లకు బాబర్ అజామ్ లు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. మొదటి టెస్టు  లార్డ్స్ లో జరుగనుండగా మిగిలిన రెండు టెస్టులు మాంచెస్టర్ , నాటింగ్హోమ్ లో జరుగనున్నాయి అలాగే మూడు టీ 20లు లీడ్స్ , కార్డిఫ్ ,సౌతాంఫ్టన్ వేదికల్లో జరుగనున్నాయి. 
 
ఇదిలావుంటే ఈసిరీస్ కన్నా ముందు ఇంగ్లాండ్ ,వెస్టిండీస్ తో మూడు టెస్టుల సిరీస్ లో తలపడనుంది. జులై 8నుండి సౌతాంఫ్టన్ లో మొదటి టెస్టు జరుగనుంది. ఈటెస్టు తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ పున: ప్రారంభం కానుంది. బయో సెక్యూర్ వాతారవరణం లో ప్రేక్షకులు లేకుండా ఈమ్యాచ్ లు జరుగనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: