భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ అడుగు పెట్టిన నాటి నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నాటి వరకు తనదైన శైలిలో ఆడి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. భారత క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు భారత జట్టులో కీలక ఆటగాడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అంతేకాదు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ మాస్టర్ బ్లాస్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తూ నే ఉన్నాడు సచిన్ టెండూల్కర్.



 భారత క్రికెట్ ప్రేక్షకులందరూ సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. 2011 ప్రపంచకప్ విజయం తర్వాత సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి కూడా సచిన్ టెండూల్కర్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. సాధారణంగా సచిన్ టెండూల్కర్ గల్లీ క్రికెట్ నుండి అంతర్జాతీయ క్రికెట్కు ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. అందుకే క్రికెట్ ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి సచిన్ టెండూల్కర్ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు. అయితే సచిన్ టెండూల్కర్ కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రస్తుతం కూడా అదే రేంజ్ లో క్రేజ్ కొనసాగుతోంది.



 అంతర్జాతీయ క్రికెట్కు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించి 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ వ్యాపార ప్రకటనల్లో సచిన్ జోరు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం ఏకంగా ఎనిమిది బ్రాండ్లకు సచిన్ టెండూల్కర్ ప్రచారకర్త గా ఉన్నారు. అయితే సచిన్ టెండూల్కర్ కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో కూడా ఎనిమిది బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు సచిన్ టెండూల్కర్. గతంతో పోలిస్తే సచిన్ టెండూల్కర్ వ్యాపార ప్రకటనలు సంఖ్య కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ అతని ఆదాయం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. ఇలా  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్ మాత్రం వ్యాపార ప్రకటనల్లో  దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: