ప్రస్తుతం ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ప్రపంచ క్రికెట్లో మాత్రమే కాదు భారత క్రికెట్లో కూడా డేవిడ్ వార్నర్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది తెలుగు అభిమానులే ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించడం ఇక జట్టును ముందుండి నడిపించడం అంతేకాకుండా తెలుగు క్రికెట్ అభిమానులను అలరించే విధంగా ఎంతో సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ పంచటం లాంటివి చేస్తూ ఉంటారు.  ముఖ్యంగా జట్టులో స్టార్ ఆటగాడు లేకపోయినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ ను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తాడు డేవిడ్ వార్నర్.



 అంతేకాదు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఒకసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా ఐపీఎల్ టైటిల్ విజేత గా కూడా నిలిచింది. అయితే కేవలం ఒక కెప్టెన్గా మాత్రమే కాకుండా ఒక కీలక బ్యాట్మెన్గా కూడా డేవిడ్ వార్నర్ ఎప్పుడు అదరగొడుతున్నాడు.  డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఎక్కువ పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి.


 కానీ ఆ తర్వాత మిగతా ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. అయితే సన్రైజర్స్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరుతో జరిగిన  టీ-20 ఫార్మెట్లో 300 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు డేవిడ్ వార్నర్. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డును అందుకున్న 32వ ఆటగాడిగా నిలిచాడు డేవిడ్ వార్నర్. మరో వైపు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ప్రస్తుతం డేవిడ్ వార్నర్ మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ఇక డేవిడ్ వార్నర్ కంటే ముందు విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో సురేష్ రైనా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: