ప్రస్తుతం భారత క్రికెట్లో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.  ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలందించిన వీరేంద్ర సెహ్వాగ్ తనదైన ఆటతీరుతో ఎన్నోసార్లు టీమిండియాకు మరువలేని విజయాలు అందించాడు. ప్రస్తుతం భారత క్రికెట్ లో దిగ్గజ మాజీ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఇక రిటైర్మెంట్ తర్వాత ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా మరింత దగ్గర అయిపోయాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనదైన శైలిలో పోస్టులు పెడుతూ  అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్.



 ముఖ్యంగా పలు క్రికెటర్లకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫన్నీగా కామెంట్ లు పెడుతూ ఉంటాడు. ఇలా అందరిదీ ఒక రూట్ అయితే తనది మాత్రం సపరేట్ రూట్ అంటూ తన పోస్టులతో చెప్పకనే చెబుతున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఇటీవలే మరో ఆసక్తికర పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు వీరు బాయ్.  భారత కెప్టెన్ లకు సంబంధించిన ఎవరికీ తెలియని ఒక విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పటి వరకు జూలై నెలలో పుట్టిన భారత క్రికెట్ కెప్టెన్ లను గుర్తు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.


 అయితే ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన పోస్ట్ లో.. జూలై 7వ తేదీన మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు..  ఇక జూలై 8 వ తేదీన సౌరవ్ గంగూలీ పుట్టినరోజు.. జూలై 10వ తేదీన సునీల్ గవాస్కర్ పుట్టినరోజు ఉన్నాయి.. ఇక జూలై 9 వ తేదీ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టి జులై 9 వ తేదీన ప్రస్తుతం మన దేశంలో ఎక్కడోచోట భారత కెప్టెన్ పుట్టి ఉంటాడు. అతనే ఇక రానున్న రోజుల్లో ఇక భారత కెప్టెన్గా మారబోతున్నాడు వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇక ప్రేక్షకులు ఇప్పటివరకు గమనించని ఈ విషయాన్ని తన పోస్టులో వీరేంద్ర సెహ్వాగ్ చెప్పడంతో.. అరెరే వీరూభాయ్ నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది.. అంటూ అటు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: