ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగి ఎనలేని సేవలు అందించి..  ఇక వయసు పైబడిన తర్వాత కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు ఎంతోమంది ఉంటారు. ఇలా రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్ళలో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు కూడా ఉంటారు.  ఇలా తమ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండ్స్ మరోసారి క్రికెట్ ఆడితే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి.  కానీ క్రికెట్కు గుడ్ బై చెప్పి ఇక పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కి కూడా దూరం అయితే మరోసారి ఆటగాడు మైదానంలోకి క్రికెట్ ఆడటం మాత్రం దాదాపు కుదరని పని అనే చెప్పాలి.


 కానీ అటు క్రికెట్ ఫాన్స్ అందరూ మాత్రం ఇలా క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్స్ మరోసారి మైదానంలో పోటీ పడితే చూడాలని ఎంతో ఆశ పడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా క్రికెట్ అభిమానుల కోరిక తీర్చేందుకు ప్రతి ఏడాది కూడా లెజెండరీ క్రికెటర్స్ తో లెజెండరీ క్రికెట్ లీగ్ పేరుతో ఒక టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇందులో అన్ని దేశాలకు చెందిన లెజెండరీ క్రికెటర్స్ పాల్గొని ఒకప్పటి లాగానే మళ్లీ పోటీ పడుతూ ఉంటారు.  ఇక మరో సారి లెజెండరీ క్రికెటర్ గా ఆటను మైదానంలో చూడడానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.



 అయితే కరోనా వైరస్ కారణంగా వచ్చే ఏడాది లెజెండరీ క్రికెట్ లీగ్ జరుగుతుందా లేదా అన్న దానిపై క్రికెట్ ఫాన్స్ అందులో సందిగ్దత నెలకొంది. ఇక ఇటీవల క్రికెట్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ అందింది. క్రికెట్ ఆటకు గుడ్ బై చెప్పిన దిగ్గజ ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి దిగి సందడి చేయబోతున్నారు  యూఏఈలో వచ్చే ఏడాది మార్చిలో లెజెండ్స్ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ టోర్నమెంట్లో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు పాల్గొననున్నారు. భారత క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత లెజెండరీ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: