ఇక ఇప్పుడు ప్రపంచ కప్ టీ 20 - 2021 టోర్నమెంట్ కోసం ఫైనల్స్ లో న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలోనే ఒక జట్టు టీ 20 ప్రంపచ చాంపియన్ కానుంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్లో పాక్ బౌలర్ మహ్మద్ హఫీజ్ వేసిన ఓ చెత్త బంతి ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతిగా మీమ్స్ స్టార్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో అయితే హఫీజ్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో వేసిన ఓ బాల్ గల్లీ క్రికె ట్‌ను గుర్తు చేసింది.
ఆ బౌల్ చూసే ప్రేక్షకులకు కూడా మంచి కామెడీ అయ్యింది. రెండు స్టెప్పులు పడి చాలా స్లోగా వచ్చిన ఆ బంతిని వార్నర్ సిక్సర్ గా మలిచాడు. అయితే అంఫైర్ ఆ బంతిని నో బాల్ గా ప్రకటించాడు. అంత జరిగాక కూడా హఫీజ్ అంపైర్ తో వాగ్వివాదానికి దిగాడు. ఇప్పుడు ఈ బాల్.. సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి