మొన్నటివరకు వన్డే టి20 క్రికెట్ లో ఎంతో దూకుడుగా ఆడి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు శ్రేయస్ అయ్యర్. కానీ ఇప్పటి వరకూ టెస్టు ఫార్మాట్లో మాత్రం ఒక్కసారి కూడా ఆరంగేట్రం చేయలేదు అని చెప్పాలి. అయితే ఇక అంతర్జాతీయ భారత జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్ళ తర్వాత టెస్టు ఫార్మాట్లో కి అరంగేట్రం చేసాడు శ్రేయస్ అయ్యర్. ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో ఆడుతున్న  టెస్ట్ సిరీస్లో ఇక టెస్ట్ ఫార్మాట్ లోకి అడుగుపెట్టాడు. అయితే సాధారణంగా టెస్ట్ ఫార్మాట్ అంటే కొత్త ఆటగాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.


 ముఖ్యంగా దూకుడుగా ఆడే యువ ఆటగాళ్ళు టెస్ట్ ఫార్మాట్లో ఎంతో నెమ్మదిగా ఆడటానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ అటు శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎంతో ధాటిగా ఆడాడు ఏ ఫార్మాట్ అయితే ఏంటి ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తన మొదటి టెస్ట్ మ్యాచ్లో నిరూపించాడు. న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే శ్రేయస్ అయ్యర్ అరుదైన గౌరవం సాధించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 105 పరుగులు రెండో ఇన్నింగ్స్లో 65 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ ఇలా మొదటి మ్యాచ్ లోనే అత్యధిక పరుగులు చేసిన మొదటి భారత ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.


 అయితే సాధారణంగా క్రికెట్లో స్టాండింగ్ ఒవేషన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది.. అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు కోచ్ యాజమాన్యంతో పాటు అందరూ కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల సెంచరీ, ఆఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ కి కూడా టీమిండియా సిబ్బంది అరుదైన గౌరవం ఇచ్చారు. ఏకంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవం తెలిపారు  దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి  ఇక ఇది చూసిన వైయస్ అయ్యర్ అభిమానులు కూడా మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: