చరిత్ర సృష్టించాలనే లక్ష్యం.. చిరకాల కలను నెరవేర్చుకోవాలని దృఢసంకల్పం.. బలమైన ప్రత్యర్థి ఎదురుగా నిలబడిన ఎక్కడా వెనకడుగు వేయకుండా చేస్తున్న పోరాటం.. ప్రస్తుతం టీమిండియా చేస్తుంది ఇదే. సౌతాఫ్రికాలో ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కూడా టెస్ట్ సిరీస్ గెలిపించిన దాఖలాలు లేవు. కానీ ఆ కలను నెరవేర్చుకోవడానికి విరాట్ కోహ్లీ సేన ప్రస్తుతం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఇక టెస్ట్ సిరీస్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రదర్శన చేస్తోంది టీమిండియా జట్టు. ఇక మొదటి టెస్టు మ్యాచ్లో శుభారంభం చేసింది.  కానీ ఆ తర్వాత మ్యాచ్ లో మాత్రం ప్రత్యర్థి పుంజుకోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.


 ఇక ఇప్పుడు విజేతను నిర్ణయించే మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే టీమిండియా బ్యాట్స్మెన్ ల వంతు అయిపోయింది. ఇక ఇప్పుడు విజయం వరిస్తుందా లేదా అన్నది టీమిండియా బౌలర్లు మీదే ఆధారపడి ఉంది. ఇక ప్రస్తుతం మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇక ఇంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఒత్తిడి ఉండడం సహజం. ఈ క్రమంలోనే ఇటీవల కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. సాధారణంగానే మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీకి ఇప్పుడు మాత్రం మరింత అసహనంగా కనిపించాడు.

 ఇన్నింగ్స్ 21 ఓవర్లలో అశ్విన్ బౌలింగ్లో ఎల్గర్ ఆడగా బంతి ప్యాడ్ లను తాకుతూ ఆప్స్ స్టంప్ దిశగా కీపర్ చేతుల్లోకి వెళ్లి పడింది. వెంటనే అశ్విన్ అప్పీల్ చేయడంతో అవుట్ గా ప్రకటించాడు అంపైర్ . వెంటనే ఎల్గార్ రివ్యూ కి వెళ్ళాడు. దీంతో రివ్యూ లో చెక్ చేయగా బ్యాట్ కు కాకుండా  కేవలం ప్యాడ్ లకు మాత్రమే తగులుతుంది అన్నట్లు గా ఉండడంతో నాటౌట్ గా ప్రకటించారు. అయితే దీంతో షాక్ తిన్న విరాట్ కోహ్లీ అసహనం తో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే స్టేంప్స్ మైక్ పై విరాట్ కోహ్లీ తన మాటలతో విరుచుకుపడ్డాడు. అంతే కాకుండా ఎప్పుడూ మా పైన దృష్టి పెడితే ఎలా.. మీ టీమ్ ను కూడా చూసుకోండి అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత మరోసారి ఎల్గర్ అవుట్ కోసం బుమ్రా అప్పీల్ చేయగా వద్దులే ఈసారి భుజాల పైనుంచి బంతి పోతుంది అని అంటారేమో అని వ్యాఖ్యానించాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: