తరచూ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఉండే రోహిత్ శర్మను కాకుండా విరాట్ కోహ్లీ లాగా ఫిట్గా ఉండే యువ ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం దృష్ట్యా రోహిత్ శర్మ కెప్టెన్సీకి సమర్ధుడు అయినప్పటికీ వయసు దృశ్య మాత్రం రోహిత్ శర్మ సరైన ఆప్షన్ కాదేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే టీమిండియా మాజీ వికెట్కీపర్ నబా కరీం కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ తన ప్రదర్శనతో గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన బలం కూడా అతడు.. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ముందు ఉన్న అసలైన సవాల్ కెప్టెన్సీ కాదు అతడు మూడు ఫార్మాట్లకు ఫిట్ గా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది. ఇలా కెప్టెన్సీ కంటే మూడు ఫార్మాట్లకు ఫిట్ గా ఉంటూ అందుబాటులో ఉండడమే రోహిత్ శర్మ కు అతిపెద్ద టాస్క్ అంటూ నభా కరీం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇప్పటికే రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఎన్నో సార్లు గాయపడ్డాడు. ఇలాంటి సమయంలో అతన్ని టెస్ట్ కెప్టెన్ గా నియమించాలి అనుకుంటే ముందుగా ఫిట్నెస్ కోచ్ ఫిజియో తో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తరచుగా గాయాల బారిన పడే ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడం ఏ మాత్రం మంచిది కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి